Vishal : విశాల్ సినిమాకు మోక్షం.. 13 ఏళ్ళ తర్వాత థియేటర్స్ లోకి.!

కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన 'మదగజరాజ' అనే సినిమా 13 ఏళ్ళ తర్వాత థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతుంది. 2012లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు వివాదాలతో రిలీజ్ కు నోచుకోలేకపోయింది. జనవరి 12న ఈ చిత్రాన్ని తమిళ్,తెలుగు భాష్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

New Update
vishal madhagadharaja movie

vishal madhagadharaja movie

కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన ఓ సినిమా, సుమారు 13 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశాల్‌కు సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న టైంలోనే ఈ మూవీ స్టార్ట్ అయింది. ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ వంటి అగ్ర నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించారు.

'మదగజరాజ' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 2012లోనే పూర్తయింది. సినిమాలో సదా ఐటెంసాంగ్‌లో మెరిసింది. మరోవైపు, కోలీవుడ్ హీరో ఆర్య గెస్ట్ రోల్‌లో నటించగా, సోనూసూద్, సంతానం వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోనీ అందించిన ట్యూన్స్ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి.

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?

అయితే, పలు వివాదాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ముఖ్యంగా, నిర్మాతలు తన రెమ్యునరేషన్ చెల్లించలేదంటూ కమెడియన్ సంతానం ఈ సినిమా విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా సినిమా విడుదల పలు వాయిదాలు ఎదుర్కొంది.

జనవరి 12 న థియేటర్స్ లోకి..

ఇప్పుడు, 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు మోక్షం లభించింది. నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను స్వయంగా తీసుకుని, విశాల్ తన ఓన్ బ్యానర్‌పై ఈ సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కోలీవుడ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?

విశాల్‌ ప్రధానంగా కోలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తుండగా, సరిగ్గా అదే సమయంలో అజిత్ 'విడాముయార్చి' సినిమా వాయిదా పడింది. ఇది కాస్త విశాల్‌ కు ప్లస్ అయింది. టాప్ హీరోల నుంచి పోటీ లేకపోవడం వల్ల, ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై విశాల్ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు