/rtv/media/media_files/2026/06/10/raja-2026-06-10-07-55-47.jpg)
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 2025 మార్చి నెలలో భారతీరాజా కుమారుడు మనోజ్ కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందారు. కొడుకు మరణించినప్పటి నుండి భారతీరాజా ఆరోగ్యం బాగా క్షీణించింది.
అంత వయసులో పుత్రశోకాన్ని ఆయన అస్సలు తట్టుకోలేకపోయారు. మనోజ్ అంత్యక్రియల సమయంలో భారతీరాజా తీవ్రమైన ఆవేదనతో కుంగిపోయిన దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టించాయి. కొడుకు దూరమైన బాధ నుండి భారతీరాజా ఇప్పటికీ కోలుకోలేకపోయారని, ఆయన మానసిక స్థితి చాలా బలహీనంగా మారిపోయిందని ఇటీవల ఆయన సోదరుడు జయరాజ్ కూడా మీడియాకు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో భారతీరాజా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చెన్నై టి.నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పట్లో ఆయన శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసంతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా (58) కన్నుమూత. అనారోగ్యంతో చికిత్స పొందుతూ భారతీ రాజా మృతి. 1941 జులై 17న జన్మించిన భారతీ రాజా. పదహారేళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు.#BreakingNews#TeluguNews#BharathiRaja
— NTV Breaking News (@NTVJustIn) June 10, 2026
పదహారేళ్ల వయసు సినిమాతో
తన కొడుకు పుట్టిన మరుసటి ఏడాది, అంటే 1977లో వచ్చిన పదహారేళ్ల వయసు సినిమాతో భారతీరాజా దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు. దాదాపు 40 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ఆయన, సినిమా రంగంలో సాధించిన విజయాలకు గాను దర్శకత్వ శిఖరం అనే బిరుదును అందుకున్నారు. మోహన్‌లాల్ నటించిన తుడరుమ్ చిత్రంలో ఆయన చివరిగా కనిపించారు.
భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. భారతీరాజా మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా భారతీరాజా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన నటించిన పులవర్ అనే సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది, ఇదే నటుడిగా ఆయనకు చివరి చిత్రం కానుంది. భారతీరాజా మరణంతో దక్షిణాది చిత్రసీమ ఒక గొప్ప లెజెండ్‌ను కోల్పోయింది.
Follow Us