Aadarsha Kutumbam: యాక్షన్ మోడ్ లో వెంకీ మామ.. ‘ఆదర్శ కుటుంబం’ కోసం భారీ పోరాటం!

వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ కథలో యాక్షన్ కూడా ఉండనుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. తమన్ మ్యూజిక్ చేసే అవకాశం ఉంది. సమ్మర్ 2026లో రిలీజ్ కావొచ్చు.

New Update
Aadarsha Kutumbam

Aadarsha Kutumbam

Aadarsha Kutumbam: టాలీవుడ్‌లో స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి Venkatesh Daggubati ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు అనిల్ రావిపూడి Anil Ravipudi దర్శకత్వంలో చేస్తున్న సినిమా సంక్రాంతి 2027కి విడుదల కావాల్సి ఉంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ Trivikram Srinivasతో కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 (AK 47)’ అనే పేరు వినిపిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమైన షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు క్లైమాక్స్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్‌ను ఫైట్ మాస్టర్ కెవిన్ కుమార్ రూపొందిస్తున్నారు. సాధారణంగా కుటుంబ కథతో ఉండే ఈ సినిమాలో వెంకటేష్ యాక్షన్ లుక్‌లో కనిపించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది.

Aadarsha Kutumbam

Also Read: సంచలనానికి 9 ఏళ్ల! ‘బాహుబలి 2’ సృష్టించిన చరిత్ర ఇదే!!

ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి Srinidhi Shetty నటిస్తున్నారు. అలాగే నారా రోహిత్ Nara Rohit, పూజిత పొన్నాడ Pujita Ponnada, రావు రమేష్ Rao Ramesh, బ్రహ్మాజీ Brahmaji వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ Haarika & Hassine Creations నిర్మిస్తోంది.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

మొదట ఈ సినిమాకు సంగీతం అందించేది హర్షవర్ధన్ రామేశ్వర్ Harshavardhan Rameshwar అని ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన స్థానంలో S. తమన్ S. Thaman చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్, తమన్ కలిసి పని చేయకుండా కొంత విరామం తీసుకోవాలని భావించినా, ఇప్పుడు మళ్లీ ఈ కాంబో కలవనున్నట్టు తెలుస్తోంది.

Also Read: ‘ధురంధర్’ కాంబో రిపీట్.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇక ఈ సినిమా సమ్మర్ 2026లో విడుదల కావొచ్చని సమాచారం. త్వరలో రిలీజ్ డేట్‌తో పాటు మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

అదే సమయంలో, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్‌లో మరో పెద్ద ప్రాజెక్ట్ కూడా ప్లాన్ అవుతున్నట్లు తెలుస్తోంది. అది Jr NTR హీరోగా తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమా అని ప్రచారం జరుగుతోంది.

Also Read: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్టేజిపై ఏడ్చేసిన హీరోయిన్.. అసలేమైందంటే?

మొత్తానికి ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు యాక్షన్ మిక్స్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ కొత్త లుక్, త్రివిక్రమ్ స్టైల్ కథ, తమన్ మ్యూజిక్ అన్ని కలిపి ఈ సినిమాపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు