Mullapudi Brahmanandam: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ముళ్లపూడి బ్రహ్మానందం.

New Update
Mullapudi Brahmanandam passed away

Mullapudi Brahmanandam passed away

Mullapudi Brahmanandam: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. ముళ్లపూడి బ్రహ్మానందం  దివంగత ఈవీవీ సత్యనారాయణకు చాలా దగ్గరి బంధువు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన కుమారుడు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. 

cinema-news | latest-news

Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు