/rtv/media/media_files/2025/02/18/tQNFvJIqGPVox930kEcR.jpg)
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను భాకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా భాకరావుపేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్ చల్ చేశారు. ఓ స్థానిక ఓ రిసార్ట్ లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇక్కడెందుకు ఉన్నారంటూ పోలీసులు మనోజ్ ను ప్రశ్నించారు. దట్టమైన అటవీ ప్రాంతం దగ్గర మీలాంటి సెలబ్రిటీలు ఉండకూడదని వెళ్లిపోవాలని సూచించారు.
మంచు మనోజ్ వర్సెస్ తిరుపతి పోలీసులు - అసలు జరిగిందేమిటంటే?
— Telugu360 (@Telugu360) February 18, 2025
మంచు మనోజ్ తిరుపతి సమీపంలోని లేక్ వ్యూ రిసార్ట్స్ లో బస చేశారు. సోమవరాం రాత్రి 11 గంటల సమయంలో అక్కడ పోలీసులు తనిఖీలు చేశారు. మంచు మనోజ్ ను గుర్తించి దట్టమైన అటవీ ప్రాంతం దగ్గర మీలాంటి సెలబ్రిటీ ఉండకూడదని వెళ్లిపోవాలని… pic.twitter.com/OU04UpDZOG
అయితే తన ప్రైవసీకి భంగం కలిగించారని మనోజ్ పోలీసులపై మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. అనంతరం పీఎస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ్నుంచి సీఐకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు.
పోలీసుల అదుపులో మంచు మనోజ్..
— సూర్యకాంతం 🕊️ (@katthiteesukora) February 18, 2025
కుటుంబ తగాదాల నేపథ్యంలో రిజిస్టర్ అయిన కేసులో.. #ManchuManoj #ManchuFamily
pic.twitter.com/WR0cHHtgAa
సీఐ వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించి రాత్రి 12.30కు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా యూనివర్శిటీ వ్యవహారాల్లో మనోజ్ జోక్యం చేసుకుంటారన్న భయంతో మనోజ్ రిసార్ట్స్ లో ఉన్నారని, అందుకే ఆయన్ను పంపించేయాలని మోహన్ బాబు వైపు నుంచి వచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Manchu Manoj in Police Custody
— M9 NEWS (@M9News_) February 17, 2025
తిరుపతిలో ఉన్న మంచు మనోజ్ ని పోలీసులు ఇప్పుడే పికప్ చేసి బాకారావు పెట్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోతున్నారు#ManchuFamily pic.twitter.com/agQyGc5ARH