Johny master : జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె ఎమన్నారో చూద్దాం..
తన కేసు విషయంలో వన్ సైడే ప్రచారం జరుగుతుందని, నేనే తప్పు చేశాననే అపోహ కలుగుతుందని వాస్తవాలు అందరికీ తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్లు మహిళా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ స్పష్టం చేశారు.నేను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకమ్మాయిని నిందితురాలిగా ఎందుకు చూస్తారు. ఒక ఫైటర్ గా ఎందుకు చూడరు అంటూ శ్రష్టి సమాజాన్ని ప్రశ్నించారు. నేను ఒంటరిగా ఫైట్ చేస్తున్నాను. సో నేను బాధితురాలిని కాదు ఫైటర్ ను కనుక మాస్క్ వేసుకోవలసిన అవసరం లేదు. నా లైఫ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నేను జీవితంలో ముందుకెళ్లాలనుకుంటున్నాను. నాలాగా గర్ల్స్ మందుకెళ్లాలి. నన్ను చూసి మిగిలినవాళ్లు స్ఫూర్తిపొందాలి. నేను కూడా బయటకు వచ్చి మాట్లాడుతాను అనుకోవాలి. సమాజం ఏదో అంటుంది. ఫ్యామిలీ ఏదో అంటుంది. స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: విజయసాయిరెడ్డి రాజీనామా.. జగన్ పై చంద్రబాబు సెటైర్లు-VIDEO
నాలుగేళ్ల తర్వాత కేసు పెట్టడానికి కారణాలు వివరిస్తూ హేమా కమిటీ రిపొర్టు రావడానికి 20 ఇయర్స్ పట్టింది. నాకు నేను పోరాడగలను అనే ధైర్యం రావడానికి టైం పట్టింది. అందుకే ఇప్పుడు కేసు పెట్టాను. నేను సేప్ గా ఉండగలను అనుకున్నపుడు బయటకు వచ్చాను. అలాగే ఎదుటి వ్యక్తి మారడానికి టైం ఇవ్వాలనుకున్న. అది అవ్వలేదు కనుకే కేసు వరకు రావాలసి వచ్చింది.నేను సమాజం గురించి ఏం ఆలోచించలేదు. నాకెరీర్, నా వర్క్ గురించే ఆలోచించాను అందుకే సమయం పట్టిందని స్పష్టం చేశారు.
నేను ఎవరినో వేధించాలనో మీడియా ముందుకురాలేదు. ఎక్కడైనా ఒకమ్మాయి కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్ అది లేకపోయినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ఒకమ్మాయిని మెంటల్ గా, ఫిజికల్ గా హింసిస్తూ ఈ అమ్మాయి ఒక బొమ్మలాగా ఉంది టాయ్ లా ఆడుకుందాం. అని తర్వాత మరో అమ్మాయితో ఆడుకుంటాం అంటే సరికాదు కదా. అమ్మాయి అంటే బొమ్మ కాదు. నేను ఎంత ఫేస్ చేశానో నాకు తెలుసు. నేను అనుభవించిన బాధను బయట చెప్పడానికే కేసు పెట్టాను. ఇప్పుడు నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఐయామ్ ఫైటర్ అని. నేను ఫైట్ చేయకపోతే మిగిలన ఆప్షన్ సూసైడ్ మాత్రమే. చాలామంది కూడా అదే చేస్తున్నారని అన్నారు.
అమ్మాయిలు రెండు రకాలు. ఒకటి ఫైట్ చేసేవారు. సమాజం గురించి ఆలోచించేవారు. సమాజం, కుటుంబం గురించి ఆలోచించే చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ నేను ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మాయి అంటే బొమ్మకాదు అని నిరూపించడానికే నిర్ణయించుకున్నాను. అమ్మాయి ఇష్టంలేదు అంటే ఇష్టం లేదనే రెస్పెక్ట్ చేయాలి. నేను గొప్పవాణ్ణి , నేను చెప్పింది చేయాలి అనుకోవడం సరికాదు కాదన్నారు. అమ్మాయి కనుక అవకాశం వచ్చింది అనేది సరికాదు. హార్ట్ వర్క్ చేశాను కనుక ఇక్కడి వరకు వచ్చానని తెలిపారు.
ఇది కూడా చదవండి: AP Politics: లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీ ఖతం.. బీజేపీ సంచలన వ్యూహం!
నేను తప్పు చేశానా లేదా అనేది నాకు తెలుసు. ఈ ఫీల్డ్ లో ఉంటే సమాజం అమ్మాయిని ఎలా చూస్తుందో నాకు తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం నా వెన్నంటి నిలిచింది. తెలంగాణ, నార్సింగ్ పోలీసులు కూడా నా కేసు విషయంలో నాకు చాలా సహాకరించారు. ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తుందంటే దాని వెనుక తను అనుభవించిన స్ట్రగుల్ ఉంటుందని వివరించారు.నేను వెళ్లి మళ్లీ ఇండస్ట్రీలో పనిచేసుకోవాలి. నా కెరీర్ ను కొనసాగించాలి అంటే నేను అన్ని తట్టుకుని నిలబడాలి. నేను ఫైటర్ ను. సోషల్ మీడియాలో నాపై వస్తున్న కామెంట్స్ చూసి నా వర్సన్ చేప్పాలనే బయటకు వచ్చాను. నేను పనిచేసిన సినిమా యూనిట్స్ అన్ని కూడా ఆడవాళ్లను గౌరవించేవే అని తనకు అక్కడ ఎలాంటి ఇబ్బంది కాలేదని స్పష్టం చేశారు.
జానీమాస్టర్ పై కేసు పెట్టడానికి నా వెనుక ఎవరో ఉన్నారు అంటున్నారు. ఎవరికోసమో నా జీవితాన్ని ఫణంగా పెట్టలేను కదా! అని శ్రష్టి ప్రశ్నించారు.ఎవరూ కూడా నన్ను కేసు పెట్టాలని ఎవరూ ప్రోత్సహించలేదు. కొన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఉన్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు. జానీమాస్టర్ కు జాతీయ అవార్డు రద్దు కావడానికి నేను చేసింది ఏం లేదు. నా అడ్వకేట్ లేటర్ రాశారనడంలో వాస్తవం లేదని అసలు తను లాయర్ ను పెట్టుకోలేదని తేల్చి చెప్పారు. ఒకే ప్రోపెషన్ పరంగా గొప్పవాడే కావచ్చు. కానీ మైండ్ సెట్ బాగలేదు అంటే ప్రొపెషన్ కూడా బాగా లేనట్లే కదా! రావణుడు గొప్ప శివభక్తుడు కానీ ఏం లాభం. అతని మైండ్ సెట్ బాగా లేదు కాబట్టే హాతమయ్యాడు. ఇది అంతే అన్నారు.
జానీమాస్టర్ నా విషయంలో తప్పుచేశాడు కనుక నేను కేసు పెట్టాను. అతను మంచివాడా చెడ్డవాడా అని నేను చెప్పను. నా విషయంలో నెల్లూరు కు చెందిన సమీర్ అనే వ్యక్తి నా మీద ఆరోపణలు చేశాడు. ఇప్పుడు అ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు. తన కేసు తీసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానన్నాడు.మరీ ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు. ఒక అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని కేసు పెట్టిందంటే సపొర్టు చేయాల్సింది పోయి మాస్టర్ భార్య, సమీర్ నాకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సిగ్గుండాలి. భార్య కనుక భర్తను వెనుకేసుకు రావడంలో తప్పు లేదు. కానీ అమ్మాయి అనే విషయం ఆలోచించాలి కదా! అంటూ ఫైర్ అయ్యారు.
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?
నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొంటే ఇప్పుడేందుకు కేసు పెట్టారని అడుగుతున్నారు. కానీ ఒకమ్మాయి ఈ విషయం బయటకు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. నాకు అప్పుడు ధైర్యం సరిపోలేదు. కానీ పదే పదే అవే వేధింపులు జరుగుతుంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు.
నేను హానీట్రాఫ్ చేశా. బ్లాక్ మెయిల్ చేశా, డ్రగ్స్ తీసుకున్నా అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. 16 ఏండ్ల వయసులో హానీట్రాఫ్ చేయాలనే థాట్ వస్తుందా? నా మీదా ఒక ప్రాపకాండ చేస్తున్నారు. నెక్ట్స్ వాడు..నెక్ట్స్ వీడు అంటూ ప్రచారం చేస్తున్నారు. సమాజం ఎంత సేపు ఒకవైపే చూస్తుందా? నా భవిష్యత్తును ఫణంగా పెట్టి బయటకు వచ్చానంటే నేను ఎంతటి మానసిక సంఘర్షణ ఎదుర్కొని ఉంటానో అర్థం చేసుకోవాలి కదా అంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లు మాస్టర్ కు చెప్పి చూశాను. అమ్మాయిలను బొమ్మల్లాగా చూడద్దు అని చెప్పా. మారుతాడు అని ఆశించా. కానీ మార్పు రాలేదు కనుకే కేసు వరకు వెళ్లాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు.
Also Read: Madhya Pradesh: ప్రసాదం గా మద్యం..కానీ బంద్ చేసిన సర్కార్..మరీ ఆచారం సంగతేంటి!
సోషల్ మీడియాలో నార్త్ అమ్మాయి అంటూ ప్రచారం చేస్తున్నారు. నార్త్ అమ్మాయిలు ఇలా ఉంటారు అని ప్రచారం చేస్తున్నారు. నార్త్, సౌత్ దేనికోసం. ఒకమ్మాయికి అన్యాయం జరిగిందంటే అది నార్త్ అయినా, సౌత్ అయినా ఒకటే కదా? ఫన్ బకెట్ భార్గవ్ విషయంలో ఏం జరిగింది. అతను వేధించింది సౌత్ అమ్మాయినే కదా! ఇక్కడ అమ్మాయి అనేది చూడాలి అంతేకానీ ప్రాంతా తేడాలెందుకన్నారు.
నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానీ మాస్టర్ అనేది నిజం కాదు. నేను రియాలిటీ షో నుంచి వచ్చాను. ఢీలో డాన్స్ లో నా ప్రతిభను నిరూపించుకున్నాను కనుక ఇండస్ట్రీ గుర్తించిందని స్పఫ్టం చేశారు.నాకు టాలెంట్ ఉంది కనుక ఇండస్ట్రీ నన్ను గుర్తించింది. నేను బాగా పని చేయకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనా? నా కాళ్లమీదా నేను నిలబడ్డాను కనుకే ఇక్కడున్న లేకుంటే ఉండేదాన్ని కాదు కదా ! అంటూ ప్రశ్నించింది.
Also Read: Jammu Kashmir: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు
కేసు కోర్టులో ఉంది కనుక చాలా విషయాలు చెప్పలేను. అమ్మాయిలను తప్పుచేసినవారిగా చూడొద్దు అని సమాజానికి చెప్పడానికి మాత్రమే ఇంటర్వ్యూకు వచ్చాను. కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా? అంటే అన్ని కోర్టులో చెబుతానని శ్రష్టి చెప్పారు.
నా గురించి నా జీవితం గురించి ఏం తెలియకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందుకే నేను వాటి గురించి పట్టించుకోను. వాస్తవానికి వారికి మాట్లాడే హక్కు లేదు. కానీ వాళ్లకు టైం ఉందికనుక మాట్లాడుతున్నారు. దాని గురించి నేను మాట్లాడను. ఇలా జరిగింది ఎవరూ పెళ్లి చేసుకుంటారు అని అంటున్నారు. సమాజంలో అందరూ అలాగే ఉండరు కదా? నన్ను అర్థం చేసుకునే వారు ఎక్కడో ఉంటారు. తను నా ధైర్యాన్ని గుర్తింని నా భార్య చాలా ధైర్యవంతురాలు అని చెప్పుకుని గర్వపడాలి. అటువంటి వాడినే చేసుకుంటాను. అయినా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచన లేదని శ్రష్టివర్మ వివరించంది.