Madha Gaja Raja : విశాల్ మదగజరాజ సినిమాను రిజెక్ట్ చేసిన నలుగురు స్టార్ హీరోయిన్లు!

విశాల్ హీరోగా తెరకెక్కిన మదగజరాజ సినిమాను ముగ్గురు స్టార్ హీరోయిన్లు వదులుకున్నారు. శ్రుతి హాసన్‌తో పాటుగా హన్సిక మోత్వాని, కార్తీక నాయర్, కార్తీక నాయర్, తాప్సీ పన్నులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలిలను ఎంపిక చేశారు.

New Update
madha gaja raja vishal

madha gaja raja vishal Photograph: (madha gaja raja vishal)

కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మదగజరాజ.  వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు.  సుమారుగా 12 ఏళ్ల పాటు విడుదలకు నోచుకోని ఈ సినిమాను  సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి ఈ రోజు అంటే జనవరి 31వ తేదీన ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చారు.  

2012లో విశాల్, సుందర్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా అనౌన్స్ మెంట్ వచ్చింది. విశాల్ సరసన హీరోయిన్ల కోసం చాలా మందినే సంప్రదించారు. ముందుగా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌కు ఆఫర్ దక్కగా ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అనంతరం దర్శకుడు సుందర్ హన్సిక మోత్వానిని సంప్రదించారు. ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సినిమా స్టార్ట్ అయ్యాక బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి హన్సిక తప్పుకుంది. 

అనంతరం కార్తీక నాయర్ ను ఎంపిక చేశారు మేకర్స్. షూటింగ్ వెళ్లే టైమ్ కు కథలో మార్పులు చేశారు  సుందర్. ఇందులో ఇద్దరు హీరోయిన్లుకు చోటు కల్పించారు.  కథను మార్చడం వల్ల తన పాత్ర తగ్గిపోయిందంటూ కార్తీక నాయర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.  ఆమె స్థానంలోకి తాప్సీ పన్ను వచ్చింది.  అయితే అప్పటికే ఆమె చేసిన ఓ  హిందీ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి డేట్స్ క్లాష్‌ రావండంతో ఆమె కూడాఈ  ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఫైనల్ గా మాయ పాత్రకు వరలక్ష్మి శరత్‌కుమార్, మాధవి పాత్రకు అంజలిలను ఎంపిక చేశారు. హైదరాబాద్, చెన్నై, జైపూర్ లో సినిమా షూటింగ్ కంప్లిట్ చేశారు.  

తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ఈ సినిమా తెలుగులో  ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.  

Also Read :  తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు