Gaayapadda Simham: సెన్సార్ పూర్తి చేసుకున్న "గాయపడ్డ సింహం" రిలీజ్ ఎప్పుడంటే..?

గాయపడ్డ సింహం సెన్సార్ పూర్తి చేసి U/A సర్టిఫికేట్ పొందింది. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ సటైర్ చిత్రం మే 1న విడుదల కానుంది. ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు.

New Update
Gaayapadda Simham

Gaayapadda Simham

Gaayapadda Simham: కామెడీ, సటైర్ అంశాలతో రూపొందుతున్న కొత్త సినిమా గాయపడ్డ సింహం Gaayapadda Simham సెన్సార్ పనులు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాకు హీరోగా తరుణ్ భాస్కర్ Tharun Bhascker నటిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా రాజకీయ సటైర్ కథతో రూపొందింది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న డిపోర్టేషన్ విధానాల నుండి ప్రేరణ పొందిన కథాంశంతో రూపొందినట్లు సమాచారం. ప్రస్తుత సమస్యలను హాస్యంతో కలిపి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మానస చౌదరి Manasa Choudhary, ఫారియా అబ్దుల్లా Faria Abdullah నటిస్తున్నారు. అలాగే విలన్ పాత్రలో జెడి చక్రవర్తి JD Chakravarthy కనిపించనున్నారు. సర్‌ప్రైజ్ పాత్రలో శ్రీవిష్ణు Sree Vishnu కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాను సప్తస్వ మీడియా వర్క్స్  Saptaswa Media Works, POV స్టోరీస్ POV Stories, Zee స్టూడియోస్ Zee Studios కలిసి నిర్మిస్తున్నారు. సంగీతాన్ని Sweekar Agasthi అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను చింతా విద్యాసాగర్ నిర్వహించారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రాజకీయ వ్యంగ్యం, వినోదం కలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు