'ఓజీ' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్

పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీపై థమన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.' అక్టోబర్లో ఫస్ట్ సింగిల్ రాబోతుంది. సినిమా ఇండస్ట్రీ హిట్ పక్కా. DVV మూవీస్ బ్యానర్కు ఇది బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్తో త్వరలో కలుద్దాం' అంటూ పేర్కొన్నారు.

New Update
og

పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న 'OG' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమాను DVV దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజై చేసిన పోస్టర్స్, గ్లింప్స్ వీడియో ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించనున్నారు. 

ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఓజీ సినిమా అప్డేట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న నేపధ్యంలో.. మేకర్స్ త్వరలో అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.." ఈ సినిమా సాంగ్స్, మేకింగ్ ఇలా ప్రతి విషయంలో డైరెక్టర్ సుజీత్ అదిరే ప్లానింగ్ చేస్తున్నాడు. 

Also Read : 'మా ఇంట మహాలక్ష్మి పుట్టింది'.. తల్లిదండ్రులైన రాకింగ్‌ రాకేష్, సుజాత

అక్టోబర్ లో ఫస్ట్ సింగిల్..

తదుపరి ఓజీ నుంచి రాబోయే సింగిల్ ప్రతిఒక్కరిని కట్టిపడేస్తోంది. ఈ అక్టోబర్లో హార్ట్ వార్మింగ్ మెలోడీ అందరి హృదయాలను టచ్ చేస్తోందని తెలిపారు. మా నుండి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రాబోతుంది. అది ఇచ్చేంతవరకు సుజీత్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడడని.. అలాగే కెమెరామెన్ రవిచంద్రన్ అదిరిపోయే విజువల్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను OG కు బెస్ట్ ఇవ్వాలి. ఇది DVV మూవీస్ బ్యానర్కు బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. 

నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్తో త్వరలో కలుద్దాం.." అంటూ పేర్కొన్నారు. థమన్ పోస్ట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే, OG తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ అంటూ పవన్ ఫ్యాన్స్ నెట్టింట వరుస పోస్టులు షేర్ చేస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment