/rtv/media/media_files/2025/02/23/vpIZtcp3XIwqjlDUlAv8.jpg)
హీరో సుహాస్ ఇన్‌స్టా గ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన ప్రాణ స్నేహితుడు మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు సుహాస్. అసలేమైందో నాకు కరెక్ట్‌గా తెలియదు. కానీ వాడు చాలా సంతోషంగా ఉండేవాడు. ధైర్యవంతుడు కూడా. కానీ ఇప్పుడు ఇలా.. ఎంత పని చేశావ్‌రా నా కొడకా అని రాసుకొచ్చి బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. తన ఫ్రెండ్‌తో సరదాగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సుహాస్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఎంతటి సమస్య వచ్చిన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడాలి కానీ ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబర్‌గా కెరీర్
యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ అంచలంచలుగా ఎదిగాడు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ రోల్స్ లో కనిపించి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓ భామ అయ్యో రామ అనే సినిమాలో సుహాస్ నటిస్తున్నాడు. ఇందులో సుహాస్ సరసన మలయాళ భామ మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇందులోప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రామ్ గోధల ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్నారు, ఈ చిత్రం "స్పిరిట్ మీడియా" ద్వారా రానా దగ్గుబాటి విడుదల చేయనున్నారు. మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
Also read : మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ
Also read : APPSC: నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు.. ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే!