అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?

హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ విధించారు. దీని ప్రకారం సభలు, సమావేశాలు నిషేధం. ఇదికాస్త 'పుష్ప 2' మూవీ టీమ్ కు తలనొప్పిగా మారింది. నవంబర్ లోనే 'పుష్ప 2' ఈవెంట్ ప్లాన్ చేయగా.. పోలీసుల ప్రకటనతో ఈ ఈవెంట్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.

New Update
allu

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కతున్న 'పుష్ప 2' మూవీ విషయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతుంది. మొదట్లో షూటింగ్ ఆలస్యం, పుష్ప నటుడు జగదీశ్ జైలుకు వెళ్లడం, సుకుమార్ కొన్ని సీన్స్ రీ షూట్, రిలీజ్ డేట్ రెండు సార్లు మారడం, మొన్న జానీ మాస్టర్ అరెస్ట్.. ఇలా ప్రతిదీ సినిమా ఆలస్యానికి కారకం అయ్యాయి. 

ఫైనల్ గా డిసెంబర్ 5 రిలీజ్ అని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా దగ్గర పడిందని నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో ఇక సినిమాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అనుకుంటున్న టైం లో ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. ‘పుష్ప-2’కు సంబంధించి గ్రౌండ్ ఈవెంట్ చాలా పెద్దగా ప్లాన్ చేశామని ఇటీవల నిర్మాత ప్రకటించాడు. త్వరలోనే ఆ తేదీలన్నీ వెల్లడిస్తామన్నాడు. 

Also Read : కిరణ్ అబ్బవరం అంటే తమిళ స్టార్స్ భయపడుతున్నారా?

కట్ చేస్తే.. పోలీసుల ప్రకటనతో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించే పరిస్థితులు లేవు. ఎందుకంటే హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేడు ప్రకటించారు. దీని ప్రకారం సభలు, సమావేశాలు, దర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నెల రోజుల పాటు హైదరాబాద్ లో నిషేధం. పబ్లిక్ ప్లేసెస్ లో ఐదుగురికి మించి గుమికూడినా చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

అప్పటివరకు నో ఈవెంట్స్..

నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ ప్రకటనతో 'పుష్ప 2' ఈవెంట్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ 5 సినిమా రిలీజ్ కాబట్టి.. నవంబర్ మంత్ అంతా పలు ఈవెంట్స్ తో ప్రమోషన్స్ చేయాలనుకున్నారు. కానీ కానీ నవంబర్ 28 వరకు సిటీలో ఎలాంటి ఈవెంట్స్ పెట్టడానికి వీల్లేకుండా పోయింది. 

Also Read : తెలుగు స్టార్ హీరోలపై సూర్య షాకింగ్ కామెంట్స్.. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా?

ఇది అటు 'పుష్ప 2' మేకర్స్ తో పాటూ అల్లు అర్జున ఫ్యాన్స్ కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పక తప్పదు. రీసెంట్ టైమ్స్ లో 'దేవర' విషయంలోనూ ఇలాగే జరిగింది. 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది నిమిషాల్లో ఉందనగా.. ఈవెంట్ కు ఊహించని స్థాయిలో జనాలు రావడంతో సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు