/rtv/media/media_files/2026/04/27/kalki-2-2026-04-27-09-23-49.jpg)
Kalki 2
Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తీసిన ‘కల్కి 2898 AD’ సినిమా భారీ విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ భాగాన్ని ఇంకా పెద్ద స్థాయిలో, లోతైన కథతో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌లో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ పాత్ర ఉండబోతుందని, అది క్లైమాక్స్‌లో కనిపిస్తుందని టాక్. ఆ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో శింబును(Simbu) సంప్రదించినట్లు సమాచారం. ఆయన ఈ సినిమాలో నటిస్తే తమిళ మార్కెట్‌లో కూడా సినిమా మరింత బలపడే అవకాశం ఉందని అంటున్నారు.
మొదటి భాగం చివరలో ప్రభాస్ పాత్రను కర్ణుడిగా చూపించి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సారి కథ ఎక్కువగా కర్ణుడి గతం, ఆయన కథ, ఆయన తిరిగి రావడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అందుకే ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఆయన మళ్లీ అశ్వథ్థామ పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా, తాజాగా బిజీ షెడ్యూల్ వల్ల అభిమానులను కలవలేకపోయానని ఆయన చెప్పారు. ప్రభాస్ కూడా త్వరలో షూటింగ్‌లో చేరనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా మళ్లీ కనిపించనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కలిసి పనిచేస్తుండడం ప్రత్యేకంగా మారింది. గతంలో వీరు ‘గిరాఫ్తార్’ సినిమాలో కలిసి నటించారు.
ఇక మరోవైపు దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి కూడా షూటింగ్‌లో చేరినట్లు సమాచారం. దీంతో ఈ సినిమాకు భారీ తారాగణం ఏర్పడుతోంది.
మొదటి భాగం ‘కల్కి 2898 AD’లో ప్రభాస్, దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించారు. భవిష్యత్ నేపథ్యంలో, పురాణాల ఆధారంగా ఈ కథ సాగింది. కల్కి అవతారంగా పుట్టబోయే ఒక ప్రత్యేక శిశువును కాపాడే కథగా సినిమా రూపొందింది.
ఇప్పుడు సీక్వెల్‌పై వస్తున్న ఈ అప్‌డేట్స్‌తో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Follow Us