/rtv/media/media_files/2025/01/24/lvKHevS39iGR9Pj4Xppd.jpg)
manchu vishnu kannappa
Manchu Vishnu Kannappa: హీరో విష్ణు మంచు లేటెస్ట్ మూవీ 'కన్నప్ప' (Kannappa) అభిమానులలో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకుంటున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas), శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ముల్లోకాలను ఏలే పరమశివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించరు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 'కన్నప్ప' సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.
Stepping into the sacred aura of Mahadev for #Kannappa🏹. Honored to bring this epic tale to life. May Lord Shiva guide us on this divine journey. Om Namah Shivaya!#LordShivaॐ #HarHarMahadevॐ pic.twitter.com/OclB6u18TH
— Akshay Kumar (@akshaykumar) January 20, 2025
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు మాట్లాడుతూ, 'అక్షయ్ కుమార్ మొదట ఈ సినిమా కోసం శివుడి పాత్రను తిరస్కరించాడు. దీంతో ఆ పాత్ర కోసం ఒక తమిళ స్టార్ హీరోను సంప్రదించాం. కానీ అతను కూడా ఆ ఆఫర్‌ను అంగీకరించలేదు' అని వెల్లడించారు.
Also Read: దాడిపై సైఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు
'కన్నప్ప'కు హ్యాండ్ ఇచ్చిన సూర్య
ఇప్పుడు ఆ హీరో ఎవరో అని నెటిజన్స్ తెగ రీసెర్చ్ చేసేస్తున్నారు. ఆ స్టార్ హీరో వేరే ఎవరో కాదట సూర్య (Surya) అని తెలుస్తోంది. సూర్య ఈ ఆఫర్‌ను తిరస్కరించడానికి కారణం, ఆయన అప్పటికే 'కర్ణ' (Karna) అనే బాలీవుడ్ సినిమాకు సైన్ చేశారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, నెటిజన్లు "నిజంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ బ్రో!" అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.
Also Read: వావ్! అమ్మాయితో కలిసి అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా