Puri Jagannadh ఇట్స్ కన్ఫర్మ్.. పూరి సినిమాలో హీరోయిన్ గా టబు!

పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమాను నౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమూవీకి సంబంధించి మరో అప్డేట్ పంచుకుంది టీమ్. ఈ ప్రాజెక్ట్ లో టబు ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు తెలిపారు. అయితే ఆమె నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

New Update
tabu joins puri Jagannadh

tabu joins puri Jagannadh

Puri Jagannadh ఒకప్పుడు టాలీవుడ్  స్టార్ డైరెక్టర్ గా రాణించిన పూరి .. ప్రస్తుతం మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో వరుస డిజాస్టర్లు చూశారు. ఈ క్రమంలో ఇటీవలే పూరి కోలీవుడ్ స్టార్ విజయ సేతుపతితో కలిసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. పూరి కనెక్ట్స బ్యానర్ పై ఛార్మి- పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాంబో వినగానే..  పూరి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. 

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

Also Read: Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..?

టబు హీరోయిన్ గా 

ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో హైదరాబాద్ బ్యూటీ టబు ఫీమేల్ లీడ్ గా నటించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తామని తెలిపారు. జూన్ లో ఈ సినిమా  చిత్రీకరణ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 

Also Read :  NIA అదుపులో తహవ్వుర్ రాణా.. ఫొటో విడుదల

cinema-news | latest-news | Puri Jagannadh -Vijay Sethupathi 

Also Read: SIKANDAR: సల్మాన్ ఖాన్ కి భారీ షాక్.. విడుదలకు ముందే మొత్తం సినిమా పైరసీ సైట్లలో

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment