#King100: నాగార్జున ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్.. 28 ఏళ్ల తర్వాత నాగ్-టబు కాంబో ఫిక్స్!

నాగార్జున 100వ సినిమా “కింగ్ 100” షూటింగ్ వేగంగా సాగుతోంది. దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు నటించనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున-టబు జంట మళ్లీ కనిపించనుండటం ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

New Update
#King100

#King100

#King100: కింగ్ నాగార్జున(Nagarjuna) తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. తాత్కాలికంగా “కింగ్ 100” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు రా. కార్తిక్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తైంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి ప్రముఖ నటి టబు(Tabu) కూడా చేరింది. ఆమె షూటింగ్ ప్రారంభించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

నాగార్జున, టబు కలిసి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకే సినిమాలో నటించడం అభిమానులకు ప్రత్యేకంగా మారింది. ఈ సినిమా కథ సాధారణ స్థాయి నుంచి ఎదిగే వ్యక్తి జీవితం ఆధారంగా ఉండగా, తండ్రి–కూతురు మధ్య జరిగే ఎమోషనల్ కథ కూడా ఇందులో ముఖ్యంగా ఉంటుందని తెలుస్తోంది. కామెడీ, ఎమోషన్స్ కలిసిన కమర్షియల్ సినిమా‌గా ఇది రూపొందుతోంది. ఇంకా సుష్మిత భట్, విజయేంద్ర వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. నాగార్జున, టబు జంటకు మంచి గుర్తింపు ఉంది. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుంది.

Advertisment
తాజా కథనాలు