SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

రాజమౌళి, మహేష్ కంబోలో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సందర్భంగా ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్‌మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఇంత అందమైన ప్రదేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. 

New Update
SSMB 29 Updates

SSMB 29 Updates

SSMB 29 Updates: ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli), మహేష్(Mahesh Babu SSMB 29) కంబోలో తెరకెక్కుతున్న మూవీ SSMB29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే అక్కడ పొందిన తన అనుభవాన్ని రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్‌మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఆద్భుతమైన విజువల్స్‌, ట్రెక్కింగ్ సమయంలో తాను చుసిన అందమైన దృశ్యాలు, ట్రెక్కింగ్ తో ఎంతో ఆనందమైన సమయాన్ని తాను గడిపినట్లు తెలిపారు.

Also Read: NTR- Nelson Movie: ఎన్టీఆర్- నెల్సన్ మూవీకి 'ROCK' ఇంగ్ టైటిల్..!

ఆ విషయంలో నిరాశపడ్డా..

ఈ మొత్తం అనుభవాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇంత అందమైన ప్రదేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. అయితే, అక్కడి పరిసరాలు మాత్రం అశుభ్రంగా ఉండటం తనను కొంచెం నిరాశకు గురి చేసిందని తెలిపారు. బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ అంతటి అద్భుతమైన ప్రదేశాన్ని, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని.  ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను వాడేసిన తరువాత పడేయకుండా తిరిగి తీసుకువెళ్లాలని సూచించారు.

Also Read: "టాక్సిక్"గా అదరగొడుతున్న రాకీ భాయ్..

ఇటీవల, #SSMB29 చిత్రం ఒడిశాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోరాపుట్ జిల్లా లో మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్ కు ప్యాక్ అప్ చెప్పారు రాజమౌళి. అయితే, గత రెండు వారాల నుండి ఓడిశాలోని  సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ ప్రాంతాలలో షూటింగ్ జరిగింది ఈ మూవీ.SSMB 29లో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!

Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment