/rtv/media/media_files/2026/03/25/srinu-vaitla-1-2026-03-25-16-54-25.jpg)
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో భారీగా మోసపోయారు. దాదాపుగా రూ.7.2 కోట్ల రూపాయల మేర ఆయనకు టోకరా వేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయన హైదరాబాద్‌లోని సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భూ కబ్జా కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ కేసు ఇప్పటిది కాదు 2019లో జరిగింది. శ్రీను వైట్లతో పాటుగా ఆయన మేనకోడలు శ్వేత కలిసి ఒక భూమిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వారిని కలిసి, కడ్మూర్ ప్రాంతంలో ఒక లాభదాయకమైన భూమి ఉందని నమ్మబలికారు. దానికి సంబంధించిన అన్ని పత్రాలు అసలైనవేనని, భవిష్యత్తులో ఈ భూమి ధర భారీగా పెరుగుతుందని ఆశ చూపారు.
Srinu Vaitla cheated in a land fraud worth around ₹7.2 crore!
— Telugu360 (@Telugu360) March 25, 2026
• In 2019, the filmmaker & his niece Swetha were allegedly lured into buying land in Kadmoor, Vikarabad with promises of high returns
• The accused reportedly showed forged documents & claimed the land deal was… pic.twitter.com/22pIjHVGck
వారితో ఉన్న పరిచయం, చూపించిన డాక్యుమెంట్లను నమ్మిన శ్రీను వైట్ల.. ఏకంగా రూ.7.2 కోట్లు చెల్లించి ఆ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అయితే, కొద్ది రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. ఆ భూమికి అసలు యజమానులు వీరు కాదని, వీరు చూపించిన డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీ చేసినవని తెలుసుకుని శ్రీను వైట్ల ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
తమను నిలువునా ముంచిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని, తన డబ్బు తనకు తిరిగి వచ్చేలా చూడాలని శ్రీను వైట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక శ్రీను వైట్ల సినిమాల విషయానికి వస్తే గతేడాది గోపీచంద్ తో విశ్వం సినిమా చేసిన హిట్ బాట పట్టిన ఈ డైరెక్టర్ ఇప్పుడు శర్వానంద్ తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow Us