Sreemukhi : పొరపాటు జరిగింది, క్షమించండి.. శ్రీముఖి వీడియో వైరల్

'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లో శ్రీముఖి.. రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో శ్రీముఖిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.దీనిపై శ్రీముఖి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

New Update
sreemukhi apologize video

sreemukhi

బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన "సంక్రాంతికి వస్తున్నాం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆమె.. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లను రామలక్ష్మణులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది.' రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ అని అప్పట్లోనే విన్నాము. ఇప్పుడు మన కళ్లముందే సాక్షాత్తు దిల్ రాజు, శిరీష్ కూర్చున్నారు' అంటూ వ్యాఖ్యానించింది. 

దిల్ రాజు, శిరీష్ లను రామలక్ష్మణులుగా పోల్చడం సరైనప్పటికీ, వారిని ఫిక్షనల్ క్యారెక్టర్‌గా పేర్కొనడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు, నెటిజన్లు శ్రీముఖిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో శ్రీముఖిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ పరిణామాలను గమనించిన శ్రీముఖి వెంటనే స్పందిస్తూ క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేసింది. 

Also Read : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్

ఆ వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ, "శ్రీముఖి ఈ వీడియోలో మాట్లాడుతూ.. రీసెంట్ టైంలో నేను హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అన్నాను. నేను ఒక హిందువునే. నేను దైవ భక్తురాలినే. రాముడిని అమితంగా నమ్ముతాను. 

కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా వీలైనంత జాగ్రత్తపడతాను అని మీ అందరికి మాటిస్తు మీ అందరికి క్షమాపణ కోరుతున్నాను. పెద్దమనుసుతో మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్.." అని పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు