Mangalavaaram: 2023లో డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ 'మంగళవారం' ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని సాధించింది. పాయల్ రాజ్ పుత్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీక్వెల్ కి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.
సీక్వెల్ లో శ్రీలీల
అయితే 'మంగళవారం' పార్ట్ 1లో పాయల్ పాత్రను ముగించిన సంగతి తెలిసిందే. కాగా, సీక్వెల్ లో నటి శ్రీలీల ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీక్వెల్ కథకు శ్రీలీల అయితే బాగుంటుందని దర్శకుడు అజయ్ భూపతి ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్ట్ 1 మాదిరిగానే పార్ట్ 2 లో కూడా హీరోయిన్ ఒక పల్లెటూరి యువతి పాత్రలోనే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముద్ర మీడియా బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. ప్రియదర్శి, నందిత శ్వేతా, అజయ్ గోష్, దివ్య పిళ్ళై ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. శ్రీలీల ప్రస్తుతం 'రాబిన్హుడ్' మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. నితిన్ హీరోగా వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ లభించింది.
cinema-news | mangalavaram-movie | sreeleela | Mangalavaaram Sequel
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్