సినిమా ఇండస్ట్రీలో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రుతిహాసన్, టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా పలు హిట్ చిత్రాలలో నటించి తన ప్రతిభను చాటుకుంది. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరమైనప్పటికీ, ఇటీవల తన రీ ఎంట్రీలో వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి అగ్రహీరోల సరసన అవకాశాలను అందుకున్న ఈ హీరోయిన్.. ప్రస్తుతం రజనీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. 2025 మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : 'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా! ఇక శ్రుతిహాసన్ వ్యక్తిగత జీవితం కూడా మీడియాలో తరచూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత,.. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిందని శ్రుతి హాసన్ స్వయంగా వెల్లడించింది. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతో డేటింగ్ చేసినా, అతనితో కూడా ఇటీవల బ్రేకప్ చేసుకుంది. ఈ బ్రేకప్ ఆమెను మానసికంగా కుంగిపోయేలా చేసింది. అందులో మజా ఉండదు.. అయితే తాజా ఇంటర్వ్యూలో లవ్, రిలేషన్‌షిప్, పెళ్లి గురించి శృతి హాసన్ తన అభిప్రాయాలను పంచుకుంది. లవ్ లైఫ్, రిలేషన్ లో ఉన్న మజా పెళ్లిలో ఉంటుందని తాను అనుకోవడం లేదని శ్రుతిహాసన్ తాజాగా వ్యాఖ్యానించింది. ప్రేమలో ఉండటం ఆహ్లాదకరమని చెప్పిన శ్రుతి, పెళ్లి చేసుకుని ఒకరితో జీవితాన్ని పంచుకోవడంపై తనకు భయం ఉందని తెలిపింది. Also Read : న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే! అంతా మారిపోయింది.. "నాకు అందమైన కుటుంబంలో జన్మించే అవకాశం లభించింది. నా అమ్మానాన్నను నేను ఉత్తమ జంటగా భావించా. వారు కలిసి పనిచేసేవారు, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించేవారు. కానీ ఎప్పుడైతే విడిపోయారో అంతా మారిపోయింది. గొడవలు పడుతూ కలిసి ఉండడం కంటే విడిపోవడమే మేలన్న పరిస్థితి వచ్చింది. అయినా కలిసి ఉండటానికి ప్రయత్నించారు.. కానీ కుదరలేదు" అంటూ చెప్పుకొచ్చింది.