ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప2' మేనియా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న 'పుష్ప2' సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. అందులో అల్లు అర్జున్ మరో స్థాయిలో నటించారంటూ పొగిడేస్తున్నారు. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్ తెప్పించారని చెబుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి 'పుష్ప1' సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది కూడా చూడండి: రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే! ఇండస్ట్రీ హిట్.. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప2' సినిమాను చూసిన శిల్పా రవి.. మీడియాతోమాట్లాడుతూ..' పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మరో స్థాయికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా పుష్ప నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా జాతర ఎపిసోడ్ నచ్చింది. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్ తెప్పిస్తారు. ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది..' అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది కూడా చూడండి: పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి Also Read: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు! Also Read: బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాలు.. 'పుష్ప' స్దానం ఎంతంటే?