జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతోంది: శేఖర్ బాషా జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత రద్దు కావడం వెనుక పెద్దల కుట్ర ఉందని శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ జైలు నుంచి బయటకు రాకుండా ఉండేందుకే కావాలనే కొందరు ప్రయత్నిస్తున్నారని బాషా ఆరోపించారు. By Kusuma 07 Oct 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి అత్యాచార ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు కాగా.. మళ్లీ రద్దయ్యింది. ఈ క్రమంలో ప్రముఖ ఆర్‌జే, బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతుందన్నారు. జాతీయ అవార్డు ప్రకటించిన తర్వాత రద్దు చేయడం వెనుక పెద్దల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు శేఖర్ బాషా. జానీ మాస్టర్ బయటకు రాకుండా ఉండేందుకు అవార్డు రద్దు చేశారన్నారు. జానీ నేషనల్ అవార్డు తీసుకోకుండా కొందరు పెద్దలు కుట్ర చేశారని ఆరోపించారు. ఇది కూడా చూడండి: వెరీ కాస్ట్లీ చేపల గుడ్లు.. ధర తెలిస్తే షాక్ కావాల్సిందే! పోక్సో కేసు ఎలా పెడతారు? జానీ కేవలం అనుమానితుడు మాత్రమే.. ముద్దాయి కాదన్నారు. జానీపై పోక్సో కేసు పెట్టడానికి అసలు ఆ యువతికి అర్హత లేదన్నారు. బాధితురాలి వయస్సు 21 ఏళ్లు కావడంతో పోక్సో కేసు నిలబడదని శేఖర్ బాషా అన్నారు. పోక్సో కేసు పెడితే.. చట్టం ప్రకారం చైల్డ్ అయ్యి ఉండాలన్నారు. చైల్డ్ కానప్పుడు పోక్సో ఎలా వర్తిస్తుంది? పోలీసులు ఎలా కేసు నమోదు చేసుకున్నారన్నారు. అసలు జానీ మాస్టర్ కేసులో బాధితురాలి తల్లే నిందితురాలు అని, సెక్షన్ 21 తల్లికి వర్తిస్తుందని శేఖర్ బాషా వ్యాఖ్యానించారు. ఇది కూడా చూడండి: ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. అవార్డు రద్దు కావడంతో జానీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ బాషా ఎంపిక అయ్యాడు. ఈనెల 8న జానీ అవార్డ్ తీసుకోవాల్సి ఉంది. న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ కూడా తీసుకోగా.. అవార్డు రద్దు చేశారు. ఇది కూడా చూడండి: Pak: ప్రియుడి కోసం 13 మంది కుటుంబ సభ్యులను చంపేసిన బాలిక! #johny-master మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి