SIKANDAR: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సికందర్'. నేడు భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రాన్ని ఊహించని షాక్ తగిలింది. రిలీజ్ కి 5 గంటల ముందే సినిమా మొత్తం పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది. తమిళ్ రాకర్స్, మూవీరూల్స్ వంటి పైరసీ సైట్లలో ప్రచారం అవుతోంది. దీంతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించారు. సాజిద్ నడియాద్వాలా నిర్మించారు.
Shame on those circulating #Sikandar piracy prints even before release. Fanwars are NOT an excuse for crimes. You're not a fan, you're a thief hiding behind a fan tag🤬
— Mastikhor 🤪 (@ventingout247) March 29, 2025
Remeber, when Salman delivers #SikandarOnEid2025 , it'll be Eid Mubarak for theatres🔥🥵#SikandarEid2025 pic.twitter.com/u3zEJaqQn5
గజిని' ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్
సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కిషోర్, శర్మన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందించారు. 'ట్రైలర్ లో ప్రేమ, వైలెన్స్, యాక్షన్, డ్రామా, న్యాయం కోసం పోరాడే తత్వం వంటి ఎమోషన్స్ తో సల్మాన్ పాత్ర ఆకట్టుకుంది. సికిందర్ గా సల్మాన్ పాత్రను ఎంతో శక్తివంతంగా చూపించారు. అలాగే రష్మిక- సల్మాన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ విడుదలకు ముందే ఇలా జరగడం చిత్రబృందానికి ఆందోళన కలిగిస్తోంది. గజిని' ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ ఈ సినిమాను తెరకెక్కించడం మూవీపై మరింత ఆసక్తిని పెంచింది.
salman-khan | Sikandar piracy | sikandar-movie
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?