Saif Ali Khan Hugs Autodriver: జనవరి 16 అర్థరాత్రి..ఆటోడ్రైవర్ డ్రైవర్ భజన్ సింగ్ రాణా ఎప్పటిలాగే ప్రయాణీకుల కోసం వెతుకుతూ తిరుగుతున్నాడు. బాంద్రాలోని ఒక ఇంటి ముందు నుంచి వెళ్తుండగా ఎక్కడో దూరంగా మహిళలు ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. వెంటనే తన చెవులు రిక్కించి మరోసారి విన్నాడు. నిజమే తనను ఎవరో పిలుస్తున్నారని నిర్ధారించుకున్నాడు. వెంటనే ఆటో ఆపాడు. ఒక ఇంటినుంచి మహిళతో పాటు మరో వ్యక్తి ఆటోవైపు రావడం చూశాడు.
ఇది కూడా చూడండి: జవాన్ సెల్ఫీకి నో చెప్పిన స్టార్ క్రికెటర్.. మండిపడుతున్న నెటిజన్లు
వస్తున్న వ్యక్తి రక్తంతో తడిచి ఉండడాన్ని గమనించాడు. మరొకరైతే మనకెందుకులే అని వెళ్లిపోయేవారే. కానీ భజన్ సింగ్ అలా చేయలేదు.ఈ అర్థరాత్రి అతన్ని వదిలిపెట్టి వెళ్తే ఆయన ప్రాణాలకే ముప్పు అని భావించాడు. రక్తమోడుతున్న అతన్ని ముందుగా ఆస్పత్రిలో చేర్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వారు ఆటో ఎక్కగానే రయ్యిమంటూ దూసుకెళ్లాడు. ఆస్పత్రికి వెళ్లిన తరువాతే తనకు తెలిసింది. తన ఆటో ఎక్కింది మామూలు వ్యక్తి కాదని. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) అని.. గాయాలతో ఉన్న ఆయన వద్ద ఒక్క పైసా కూడా తీసుకోలేదు.. తీవ్ర గాయాలతో బాధపడుతున్న సైఫ్ ప్రాణాలతో బయటపడితే అంతే చాలనుకున్నాడు.. ఆ రోజు భజన్‌సింగ్(Bhajan Singh) సమాయానికి ఆస్పత్రికి తరలించడం వల్లే ఈ రోజు సైఫ్ అలీఖాన్ ప్రాణాలతో భయటపడగలిగాడు. అలా అని ఆటోడ్రైవర్‌ను సైఫ్ మరిచిపోలేదు. ఆస్పత్రికి పిలిపించుకొని తన పక్కనే కూర్చుండబెట్టుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. సైఫ్ తల్లి అతన్ని ఆశీర్వదించింది.
📸#InPics | Actor Saif Ali Khan meets auto driver Bhajan Singh Rana who took him to hospital after attack#SaifAliKhan pic.twitter.com/kkDJOWJhn7
— NDTV (@ndtv) January 22, 2025
Also Read : సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
ఆటోడ్రైవర్‌ను కౌగిలించుకున్న సైఫ్‌ఆలీఖాన్
సైఫ్ అలీఖాన్ ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి ముందు ఆస్పత్రికి పిలిపించుకున్నారు. అతని యోగక్షేమాలు తెలుసుకుని కాసేపు ఆస్పత్రి బెడ్డుమీదే కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. అనంతరం ప్రేమతో కౌగిలించుకున్నాడు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ భజన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించారు.మంగళవారం లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి ముందు ఈ ఘటన జరిగింది.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా సంఘటన జరిగిన రాత్రిని గుర్తు చేసుకున్నారు. "తను నా ఆటో ఎక్కేవరకు అతనో బాలీవుడ్ నటుడని నాకు తెలియదు. ఖాన్ నా ఆటోలో ఎక్కిన వెంటనే అడిగిన మొదటి ప్రశ్న ఆస్పత్రికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది అని' అని అన్నారు. "ఎప్పటిలాగే నేను నా ఆటోలో వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక ఇంటి గేట్ నుండి శబ్దం వినిపించింది. ఒక మహిళ మెయిన్ గేట్ దగ్గర నుండి రిక్షా ఆపు అంటూ కేకలు వేస్తోంది. వెంటనే ఆటో ఆపాను. ఒకవ్యక్తి (సైఫ్ అలీ ఖాన్) స్వయంగా నడుచుకుంటూ వచ్చి ఆటోలో కూర్చున్నాడు. అతను గాయపడిన స్థితిలో ఉన్నాడు. అతనితో ఒక చిన్న పిల్లవాడు, మరొక వ్యక్తి ఉన్నాడు. నా ఆటోలో కూర్చున్న వెంటనే, సైఫ్ అలీఖాన్ నన్ను ఆస్పత్రికి చేరుకోవడానికి ఎంత టైమ్ పడుతుందని అడిగాడు. ఎనిమిది నుంచి పది నిమిషాలు అన్నాను. అనుకున్న సమయానికి ఆసుపత్రికి చేరుకున్నాం. "అతని మెడ, వీపు నుండి రక్తం కారుతోంది. అతని తెల్లని కుర్తా ఎర్రగా మారింది. అప్పటికే చాలా రక్తం చాలా పోయినట్టుంది. ఆస్పత్రికి చేర్చాక నేను ఛార్జీలు కూడా తీసుకోలేదు. ఆ సమయంలో నేను అతనికి సహాయం చేయగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది" అని డ్రైవర్ చెప్పాడు.
ఇది కూడా చూడండి: ఉస్మానియా యూనివర్సిటీ పదోన్నతుల్లో లొల్లి.. ఔటా ఫిర్యాదు
జనవరి 16న బాంద్రాలోని తన ఇంటిలో చోరీకి ప్రయత్నించిన ఓ అగంతకున్ని సైఫ్ అలీఖాన్ అడ్డుకున్నాడు. దీంతో అగంతకుడు సైఫ్ పై కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు పడ్డాయి. గాయాలతో ఉన్న సైఫ్‌ను తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటోరిక్షాలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతనికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. దాడి చేసిన బంగ్లాదేశ్(Bangladesh) నివాసి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30)ని ముంబై పోలీసులు ఆదివారం థానేలో అరెస్టు చేశారు. కేవలం చోరీ కోసమే వచ్చినట్లు, అడ్డుకోవడంతో దాడి చేసినట్లు షెహజాద్ వెల్లడించాడు. తను దాడిచేసింది బాలీవుడ్ నటుడు సైఫ్ అని కూడా ఆ అగంతకునికి తెలియదు. ఆదివారం మధ్యాహ్నం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించారు.