Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

సైఫ్ అలీ ఖాన్‌ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి ములను తొలగించాం. మెడ పై గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేశాం. సైఫ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదు. సర్జరీ తర్వాత ఐసీయూకు తరలించాం అని వైద్యులు వెల్లడించారు.

New Update
saif ali khan

saif ali khan

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడి కారణంగా సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 

సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి ములను తొలగించాం. ఘర్షణ సమయంలో కత్తి విరిగిందని, వెన్నెముకకు తగిలిన గాయమే పెద్దదని తెలిపారు. మెడ పై గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేశామని, ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. సర్జరీ తర్వాత ఆయన్ని ఐసీయూకు తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

Also Read :  షాకింగ్ న్యూస్ .. విడాకులు తీసుకోనున్న ఒబామా కపుల్స్!

కాగా ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్‌లు ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన  వ్యక్తికి ఆ ఇళ్లు గురించి బాగా తెలిసి ఉంటుందనిపోలీసులు అనుమానిస్తున్నారు.  సైఫ్ అలీఖాన్‌ స్టార్ హీరో కాబట్టి ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. పైగా ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలుంటాయి.

ఈజీగా అతని ఇంట్లో దొంగతనం చేసేందుకు ఎవరూ కూడా పెద్దగా సాహసం చేయరు. ఇదంతా తెలిసినవాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కరీనా లేని టైమ్ చూసి,  సైఫ్  ఒక్కడే ఉన్నాడని తెలిసే ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు అంచనా వేస్తున్నారు.  ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు  నిందితుడిని పట్టుకోవడానికి  అనేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు