Amaran : 'అమరన్' కోసం సాయి పల్లవి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందా? సాయి పల్లవి రెండేళ్ల గ్యాప్ తర్వాత 'అమరన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఆమె శివ కార్తికేయన్ సరసన నటించింది. అయితే ఈ మూవీ కోసం సాయి పల్లవి ఏకంగా రూ.3 కోట్ల వరకు పారితోషకం తీసుకుందట. ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. By Anil Kumar 27 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'అమరన్'. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో సాయి పల్లవి.. శివ కార్తికేయన్ తో మొదటిసారి జత కట్టింది. టీజర్, సాంగ్స్, ట్రైలర్ లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. Also Read : రెండో పెళ్లి పై సమంత క్లారిటీ.. ఏం చెప్పిందంటే? గ్యాప్ వచ్చినా తగ్గేదేలే.. అయితే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కోసం సాయి పల్లవి ఏకంగా రూ.3 కోట్ల వరకు పారితోషకం తీసుకుందట. 'గార్గి' తర్వాత సాయి పల్లవి సుమారు రెండేళ్లు సినిమాలు చేయలేదు. అయినా కూడా 'అమరన్' సినిమాకు మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. Also Read: దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) Also Read : కోర్టుల్లో సాక్షులు ఎందుకు ప్రమాణం చేస్తారు? Also Read : రెండో పెళ్లి పై సమంత క్లారిటీ.. ఏం చెప్పిందంటే? #tollywood #sai-pallavi #amaran-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి