Rajamouli: కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' మూవీపై రాజమౌళి పోస్ట్..రియాక్ట్ అయిన హీరో

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన 'మ్యాక్స్' మూవీపై ఎస్. ఎస్. రాజమౌళి పోస్ట్ పెట్టారు. సినిమా సక్సెస్‌ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం నాకు సినిమాను చూడటానికి సమయం లేదు, కానీ ‘మ్యాక్స్‌’ చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

New Update
rajamouli on max movie

rajamouli on max movie

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దర్శక ధీరుడు రాజమౌళి.. 'ఈగ' సినిమాతో ఆయన్ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. నాని హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో సుదీప్ విలన్ గా అదరగొట్టాడు. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. 

కొంత కాలంగా ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇక సుదీప్ హీరోగా నటించిన  తాజా చిత్రం ‘మ్యాక్స్‌’. విజయ్‌ కార్తికేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా సినిమా సక్సెస్ పై దర్శకుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేస్తూ మూవీ టీమ్ ను అభినందించారు.

Also Read : నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో.. " సినిమా సక్సెస్‌ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మాస్‌ సినిమాలు తీయడంలో ఎప్పుడూ ముందుంటావు. ప్రస్తుతం నాకు సినిమాను చూడటానికి సమయం లేదు, కానీ ‘మ్యాక్స్‌’ చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా.." అంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మీ రివ్యూ కోసం వెయిటింగ్..

రాజమౌళి పోస్ట్ కు సుదీప్‌ స్పందిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.' మీ అభినందనలు మా టీమ్‌కు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చాయి. సినిమాపై మీ రివ్యూ కోసం ఎదురుచూస్తుంటాను..' అని రిప్లై ఇచ్చారు.

Also Read : 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇక 'మ్యాక్స్' మూవీ విషయానికొస్తే.. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో సుదీప్‌తో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంయుక్త, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 

#latest-movie-updates #s-s-rajamouli #kiccha-sudeep #latest-telugu-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు