రోజా సెల్వామణి.. ఈపేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అయిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు షోలకు జడ్జిలగా నిర్వహించేది. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వ సమయంలో రోజా నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందింది. దీంతో జగన్ ప్రభుత్వం రోజాకు ఏపీ మినిస్టర్ టూరిజం పదవిని కూడా ఇచ్చారు.
ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
సినిమాలు, షోలు చేయనని చెప్పి..
మంత్రి పదవి చేపట్టిన తర్వాత రోజా పలు టీవీ షోలకు గుడ్ బై చెప్పింది. ఈ సమయంలో రోజా పాపులర్ షో జబర్దస్త్‌లో జడ్జిగా వ్యవహరించేది. అయితే బాధ్యత గల మంత్రి పదవిలో ఉండటంతో జబర్దస్త్ షోకి వీడ్కోలు పలకడంతో పాటు ఇకపై షోలు, సినిమాలు చేయనని తెలిపింది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది.
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
నగిరి నియోజక వర్గం నుంచి రోజా కూడా ఓటమిని చూసింది. అయితే తాజాగా రోజా మళ్లీ బుల్లి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4లోకి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. రోజా ఇందులో దర్శనమిచ్చింది. ఈ ప్రోమోలో శ్రీకాంత్, రాశి కూడా ఉన్నారు.
వీరు ముగ్గురు కూడా ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 2వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో మొదలు కానుంది. ఈ షోకి రవి, అషురెడ్డి యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నారు. బుల్లి తెరపై రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!