Ravi Mohan : చేతులు కోసుకున్నా : విడాకులు వచ్చే వరకు యాక్టింగ్ చేయను.. ఏడ్చేసిన జయం రవి

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆయన నిప్పులు చెరిగారు.

New Update
jayam ravi

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆయన నిప్పులు చెరిగారు. తన ఓర్పును పరీక్షించవద్దని హెచ్చరించారు.  ఈ ప్రెస్‌మీట్‌లో జయం రవి తన వైవాహిక జీవితంలో అనుభవించిన నరకాన్ని చెప్తూ, గతంలో తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాననే షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.

ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా

"నేను నా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాను. దానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాను. మానసిక వేధింపులు తట్టుకోలేక ఒకానొక దశలో నేను నా మణికట్టు కోసుకున్నాను. రక్తం కారుతున్నా సరే, మరుసటి రోజు నా సినిమా షూటింగ్‌కు హాజరయ్యాను. సినిమాపై నాకున్న కమిట్‌మెంట్ అది. కానీ ఇప్పుడు నా పిల్లలను కూడా నన్ను చూడనివ్వడం లేదు. వారు స్కూల్‌కు వెళ్తుంటే బాడీగార్డ్స్ పెట్టి నన్ను దూరం పెడుతున్నారు." అంటూ రవి ఏడ్చేశారు.

ఆన్‌లైన్ వేధింపులు చేసేవారిపై జయం రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీ ఆన్‌లైన్ వేధింపుల వల్లే కెనీషా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. చెన్నైని వదిలేసింది. ఆమె తన కెరీర్‌ను, మ్యూజిక్‌ను, థెరపీని కూడా వదిలేసుకునేలా చేశారు. నా వద్ద అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. మిమ్మల్ని వదిలిపెట్టను. సైబర్ బుల్లింగ్ చేసిన ప్రతి ఒక్కరి అకౌంట్లను, నన్ను అవమానించిన ఆధారాలను కోర్టుకు సమర్పిస్తానని హెచ్చరించారు.

తన భార్యతో పాటు ఇండస్ట్రీలోని ఒక మూడు అక్షరాల పేరున్న ఇడ్లీ'నటిపై కూడా జయం రవి మండిపడ్డారు. పెద్ద పెద్ద మహిళా హక్కుల గురించి మాట్లాడే ఆ నటి, ఇతరుల కుటుంబాలను కూల్చడంలో బిజీగా ఉందని ఆరోపించారు. పబ్లిక్ ఫోరమ్స్‌లో ఫెమినిజం గురించి మాట్లాడే నైతిక హక్కు ఆమెకు లేదని దుయ్యబట్టారు. ఈ ప్రెస్‌మీట్‌లో రవితో పాటు అతని బావ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఆ కుటుంబం వల్ల తానూ, తన బావ ఇద్దరమూ నరకం చూశామని రవి పేర్కొన్నారు.

జయం రవి ప్రెస్‌మీట్‌కు ముందు రోజు శుక్రవారం, సింగర్, స్పిరిచువల్ థెరపిస్ట్ కెనీషా ఫ్రాన్సిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు.

ఆన్‌లైన్ వేధింపులపై కెనీషా స్పందిస్తూ.. నాకు 18 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. అప్పట్లో నాకు లోకం తెలియదు. నా కడుపులోనే నా బిడ్డ చనిపోయింది. గర్భంలోనే బిడ్డను కోల్పోయిన నరకాన్ని అనుభవించిన నేను.. వేరే ఒకరి కుటుంబాన్ని కానీ, పిల్లలను కానీ తండ్రికి దూరం చేస్తానా? రవి మోహన్ చిన్న పిల్లాడు కాడు. ఎవరితో మాట్లాడాలి, ఎలా బతకాలో ఆయనకు తెలుసు. మొదట్లో ఆయన కేవలం మానసిక ప్రశాంతత కోసం థెరపీ కోసమే నా వద్దకు వచ్చారని క్లారిటీ ఇచ్చారు. కొందరు తనపై చేయిస్తున్న చేతబడులు తట్టుకోలేక తాను చెన్నై వదిలి వెళ్ళిపోతున్నట్లు కెనీషా ప్రకటించారు.

మౌనంతో వెళ్ళిపోతున్నా

నేను ఈ కథలోకి ప్రేమతో వచ్చాను, మౌనంతో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కేవలం అబద్ధాలకోరులు, మోసగాళ్లు, మానిప్యులేటర్లకు మాత్రమే చోటుంది. నేను నా మ్యూజిక్‌ను, నా థెరపీని, నా కెరీర్‌ను వదిలేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేస్తున్నాను. చివరగా ఒక్కటి.. ఫెమినిజం, నువ్వు గెలిచావు! సంతోషం, నువ్వు ఓడిపోయావు! గుడ్ బై. అంటూ కెనీషా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు