RANU BOMBAI KI RANU: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

'రాను బొంబాయి కి రాను' పాటకు మొత్తం 5 లక్షలు ఖర్చు పెట్టగా.. సాంగ్ సూపర్ హిట్ కావడంతో యూట్యూబ్ నుంచి దాదాపు 20 లక్షలు వరకు వచ్చినట్లు సింగర్ రామ్ రాథోడ్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 124 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

New Update

RANU BOMBAI KI RANU: 'రాను బొంబాయి కి రాను'.. ఈ ఫోక్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టు అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రెండు, మూడు నెలలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే  మారుమోగింది. రీల్స్, వీడియోలు చేస్తూ నెటిజన్లు ఈపాటను తెగ ఎంజాయ్ చేశారు. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపింది. ఇందులో సినిమా లెవెల్ విజువల్స్, అదిరిపోయే మ్యూజిక్, కొరియోగ్రఫీ  ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత పాపులరైన ఈ పాటను ఎంత ఖర్చు పెట్టి తీశారు?  ఆ తర్వాత.. అది హిట్టయ్యి ఎంత లాభాలు తెచ్చింది? తెలిస్తే షాక్ అవుతారు. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

5 లక్షలతో.. 20 లక్షలు 

అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ రామ్ రాథోడ్..  ఈ పాటకు మొత్తం 5 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కేవలం షూటింగ్ కోసం 3.5 లక్షల వరకు ఖర్చు అవగా.. మ్యూజిక్, ఇతర వాటి కోసం మరో 2 లక్షలు ఖర్చు చెప్పారు. కాగా, సాంగ్ విడుదలైన తర్వాత సూపర్ రెస్పాన్స్ రావడంతో  యూట్యూబ్ నుంచి  దాదాపు 20 లక్షలు వరకు వచ్చినట్లు తెలిపారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. 2025 జనవరిలో విడుదలైన ఈ సాంగ్.. ఇప్పటి వరకు యూట్యూబ్ లో 124 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 

latest-news | telugu-news | RANU BOMBAI KI RANU

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు