/rtv/media/media_files/2025/09/16/peddi-updates-2025-09-16-10-19-51.jpg)
Peddi Update
Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న విలేజ్ యాక్షన్ మూవీ “పెద్ది” షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రతి షెడ్యూల్ కూడా ఎనర్జీతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌పై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌కు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు, ఇది చిత్రానికి మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది.
ఈ యాక్షన్ బ్లాక్‌ను బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ మాస్టర్ షామ్ కౌశల్ (దంగల్ ఫేమ్) రూపొందిస్తున్నారు. ఆయనతో పాటు నావకాంత్ కూడా ఈ సన్నివేశాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమా కథలో కీలక మలుపుని చూపించబోతోంది. ప్రేక్షకులు థియేటర్లో చూసేటప్పుడు ఇది ఒక ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని టీమ్ చెబుతోంది.
Also Read : రణ్వీర్ సింగ్ 'ధురంధర్' షాకింగ్ రన్‌టైమ్.. ఎన్ని గంటలంటే..?
ఇదివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ షాట్ గ్లింప్స్'కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ గెటప్, పాత్ర తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలానే, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కూడా యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఈ పాట 110 మిలియన్లకు పైగా వ్యూస్ దాటేసి, ఇంకా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది మన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రహ్మాన్.
సెట్, యాక్షన్, నటీనటులు ప్రతీ విభాగం మీద టీమ్ ఎంత కేర్ తీసుకుంటుందో ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్ చూస్తేనే తెలుస్తోంది. “పెద్ది” ఒక రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నందున, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఇటీవల వరుసగా భిన్నమైన పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక “పెద్ది”లో ఆయన మరింత రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారని టీమ్ చెబుతోంది. ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ ఎపిసోడ్ పూర్తయ్యాక, వచ్చే షెడ్యూల్స్ కూడా వరుసగా కొనసాగనున్నాయి.
మొత్తానికి, ఉన్న క్రేజ్‌కే కాకుండా, జరుగుతున్న షూట్ అప్డేట్స్తో “పెద్ది”పై ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. చరణ్- బుచ్చి బాబు కలయికలో వచ్చే ఈ సినిమా టాలీవుడ్లో మరొక బ్లాక్‌బస్టర్ అవుతుందేమో చూడాలి.
Follow Us