సూపర్ హీరో మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి డైరెక్టర్ గా కూడా! 'క్రిష్4' పై అదిరే అప్డేట్!

హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించి న 'క్రిష్' ఫ్రాంచైజీ నుంచి క్రిష్4 సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ సీక్వెల్ కి హీరో హృతిక్ రోషన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు.

New Update

Krrish4:  హృతిక్ రోషన్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ 'క్రిష్' ఫ్రాంచైజీ నుంచి 'క్రిష్ 4' ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాతో హృతిక్ రోషన్ డైరెక్టర్ గా మారనున్నారు. ఇందులో హృతిక్ నటించడంతో పాటు స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన క్రిష్ ఫ్రాంచైజీలు  'కోయి మిల్ గయా', 'క్రిష్', 'క్రిష్ 3' చిత్రాలకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు కొడుకును డైరెక్టర్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. యష్ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ రోషన్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!

క్రిష్ 3 సీక్వెల్.. 

 2013లో విడుదలైన  'క్రిష్3' సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్ , ప్రియాంక చోప్రాతో, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. విలన్ వివేక్ ఒబెరాయ్  (కాల్)  వైరస్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేయగా.. దానిని క్రిష్, అతడి తండ్రి ఎలా అడ్డుకున్నారు అనేది క్రిష్ 3 లో చూపించారు. అప్పట్లో రూ. 95 కోట్లతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.  393 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

latest-news | hrithik-roshan

Also Read: Kissik Song: 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో.. సెట్ లో బన్నీ, రష్మిక, సుకుమార్ ఎలా చేశారో చూడండి!

Advertisment
Advertisment
Advertisment