Varanasi: రెండు భాగాలుగా వారణాసి.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న..?

ఎస్.ఎస్. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న భారీ సినిమా వారణాసి ఒకే భాగంగా తెరకెక్కుతోంది. సుమారు మూడు గంటల నిడివితో ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. రూ.1300 కోట్ల బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.

New Update
Varanasi

Varanasi

Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి ఉంది. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంతో రూపొందుతోంది. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది.

2025 నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే తెలివైన విలన్ పాత్రలో కనిపించనున్నారు.

ప్రేక్షకులు ఈ సినిమా టీజర్ IMAX స్క్రీన్లపై 2027 ఏప్రిల్ 7న చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్‌లో చూపించిన విజువల్స్ ఇప్పటివరకు చూడని విధంగా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

Also Read: సారీ డార్లింగ్స్.. ఈ సారి నో ఐటెం సాంగ్..!

ఇటీవల హైదరాబాద్‌లో రాజమౌళి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ప్రేక్షకులలో ఎక్కువగా ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అదే ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందా అనే విషయం. మొదట్లో కథను రెండు భాగాలుగా చేయాలనుకున్నామని, కానీ తరువాత ఆ ఆలోచనను వదిలేశామని ఆయన చెప్పారు. వారణాసి ఒకే భాగంగా, సుమారు మూడు గంటల నిడివితో విడుదల కానుందని స్పష్టంగా తెలిపారు. దీంతో సీక్వెల్‌పై ఉన్న సందేహాలకు క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో హిట్ అయిన ఒక తమిళ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్టు సమాచారం.

సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, షోయింగ్ బిజినెస్ తరఫున ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. త్వరలో షూటింగ్ పూర్తి చేసి, ప్లాన్ చేసిన విధంగా ప్రమోషన్స్ మొదలుపెట్టాలని రాజమౌళి భావిస్తున్నారు. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు