Pushpa 2 Day 24 collections: అల్లు అర్జున్ 'పుష్ప2' ర్యాంపేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నాలుగవ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో సత్తా చాటుతోంది. వారం ప్రారంభంలో కలెక్షన్స్ కాస్త డల్ గా ఉన్నప్పటికీ వీకెండ్ భారీగా పెరిగాయి. 23వ రోజుతో పోలిస్తే 24వ రోజు (శనివారం) కలెక్షన్స్ 42.86 శాతానికి పెరిగాయి. హిందీ వెర్షన్ వారాంతపు కలెక్షన్లను పెంచడంలో ముఖ్య పాత్ర పోషించించి. శనివారం దేశవ్యాప్తంగా రూ.12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ నివేదిక తెలిపింది. Also Read: SSMB29: రికార్డులకు తెరలేపే కాంబినేషన్.. మహేశ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్! ఒక్క రోజులోనే 42% పెరిగిన కలెక్షన్స్ 24వ రోజున.. తెలుగులో రూ. 2.1 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, తమిళం నుంచి రూ. 35 లక్షలు, కర్ణాటక ద్వారా రూ. 4 లక్షలు, మలయాళం నుంచి రూ. లక్ష రాబట్టినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 741.15 కోట్లు, తెలుగు రూ.322.23 కోట్లు, తమిళ వెర్షన్ రూ. 56.3 కోట్లు, కన్నడ, మలయాళ వెర్షన్లు రూ. 7.57, రూ. 14.1 కోట్లు వసూళ్లు సాధించాయి. మొత్తంగా 'పుష్ప 2' 21రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1705 కోట్లు సాధించగా.. ఈ వారాంతం వసూళ్ళు పెరగడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 1788.06 కోట్లుగా ఉన్న బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడానికి అత్యంత చేరువలో ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రూ 2000 కోట్లు రాబట్టిన అమీర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన రెండవ భారతీయ చిత్రం 'పుష్ప 2' అవుతుంది . ఇది ఇలా ఉంటే పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టును ఆశ్రయించారు. కాగా, హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?