జానీ మాస్టర్ కు బెయిలొచ్చింది, 'పుష్ప2' షూట్ లో జాయిన్ అవుతారా?

మైత్రీ మూవీస్ నిర్మాతలు 'పుష్ప 2' కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో 'పుష్ప 2'లో సాంగ్ ఆయనే కంపోజ్ చేస్తున్నారా?' అని అడగ్గా.. ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నామని నిర్మాత తెలిపారు.

New Update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీకి సంబంధించి నిర్మాతలు నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. అంతేకాకుండా సినిమా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

వేరే కొరియోగ్రాఫర్ తో..

ఇందులో భాగంగానే ఓ విలేకరి..' జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో పుష్ప 2లో సాంగ్ ఆయనే కంపోజ్ చేస్తున్నారా?' అని మీడియా ప్రశ్నించగా నిర్మాత సమాధానమిస్తూ..' ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నాము..' అని తెలిపారు. 

అంతేకాకుండా ఆ ఐటెం సాంగ్ నవంబర్ 4 నుంచి షూట్ చేయబోతున్నామని, అందులో నటించే హీరోయిన్ కు సంబంధించిన వివరాలు మరో రెండు రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు. కాగా 'పుష్ప 2' సినిమాలో ఐటెం సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని తీసుకున్నారు. 

Also Read : 'కంగువ' ప్రెస్ మీట్.. సూర్య స్టైలిష్ లుక్, దిశా పటాని హాట్ షో

అయితే ఇటీవల ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు చేసాడని జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసింది. దీంతో జానీ మాస్టర్ జైలుపాలయ్యారు. ఇదికాస్త ఇండస్ట్రీలో వివాదం అయింది. దాంతో 'పుష్ప' నిర్మాతలు జానీ మాస్టర్ ను తీసేసి వేరే కొరియోగ్రాఫర్ ను పెట్టుకున్నారు.

షరతులతో కూడిన బెయిల్..

జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తనని లైంగికంగా వేధించారన్న మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రెండు వారాలుగా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో ఆయనకు ప్రకటించిన నేషనల్‌ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ అవార్డు ఫంక్షన్‌ కోసం జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ కూడా పొందారు. తాజాగా మరోసారి తనకు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది.

Also Read : అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. ఫ్యాన్స్ అంతా ఒక్కటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment