Kissik Song: అల్లు అర్జున్ 'పుష్ప2' లో ప్రతీ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ముఖ్యంగా 'కిస్సిక్' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. నిజానికి రిలీజైన మొదట్లో ఈ పాట ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. ఊహించనంతగా ఏం లేదని కామెంట్స్ చేశారు. కానీ, ఆ తర్వాత వింటూ వింటూ ఉండగా జనాలకు బాగా ఎక్కేసింది. ఫోన్, టీవీల నుంచి మొదలుకొని ఆటోలు, బస్సుల్లోనూ ఇదే పాట మారుమోగింది. రీల్స్ వీడియోలు చేస్తూ జనాలు తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పటి వరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 101 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!
Making of #Kissik 🔥🔥 pic.twitter.com/2jVKdeSBtp
— VK Cineholic (@VKCineholic) November 24, 2024
మేకింగ్ వీడియో..
ఇదిలా ఉంటే తాజాగా 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సెట్ లో కొరియోగ్రాఫర్స్ తో కలిసి అల్లు అర్జున్, శ్రీలీల, రష్మిక స్టెప్స్ ప్రాక్టీస్, మధ్య మధ్యలో ఫన్ చేస్తూ సందడిగా కనిపించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'కిస్సిక్' సాంగ్ అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డు క్రియేట్ చేసింది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేయగా.. సుబ్లాషిణి ఈ పాటను పాడారు.
గతేడాది విడుదలైన 'పుష్ప2' భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1870 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో అల్లు అర్జున్ నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.
telugu-news | latest-news | Pushpa 2 Kissik Song | Kissik Song Making video
Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!