Puri Jagannadh: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

టాలీవుడ్ కు మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కథ చెప్పారని తెలుస్తోంది. స్క్రిప్ట్ విన్న వెంటనే విజయ్ సేతుపతి కూడా ఓకే చేసేసారట. అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

New Update
Puri Jagannadh- vijay sethupathi

Puri Jagannadh- vijay sethupathi

Puri Jagannadh: టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబోలో మూవీ రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)కి కథ చెప్పారని తెలుస్తోంది. స్క్రిప్ట్ విన్న వెంటనే విజయ్ సేతుపతి కూడా ఓకే చేసేసారట.

స్క్రిప్ట్ బాగా నచ్చినందున విజయ్ సేతుపతి తన బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ సినిమాకే ప్రాధాన్యత ఇచ్చాడని తెలుస్తోంది. పూరీ కూడా కేవలం విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకొని కథని సిద్ధం చేశారట. అందుకు సంబందించిన పూర్తి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అన్ని కుదిరి ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే మాత్రం పూరీ ఖాతాలో ఈసారి పక్కా హిట్ పడ్డట్టే.

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

పూరీ కమ్ బ్యాక్ మూవీ..

ఈ సినిమా పూరీ కి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పూరీ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా  కొట్టిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతితో  హిట్ కొట్టాలని పూరీ ఎదురుచూస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి చివరగా వెట్రిమారన్ డైరెక్షన్ లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2 లో కనిపించి మెప్పించాడు.

Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు