Kalki 2: “కల్కి 2”పై రూమర్స్ కు చెక్ పెట్టిన స్వప్నా దత్‌.. ఏమన్నారంటే..?

“కల్కి 2”పై రోజూ ఏదొక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్‌తో మెయిన్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. కమల్ హాసన్ తిరిగి కనిపించనుండగా, దీపికా ప్లేస్ లో వేరేయ్ హీరోయిన్ మెరవనుంది. రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

New Update
Kalki 2

Kalki 2

Kalki 2: ప్రభాస్(Prabhas) నటించిన “కల్కి 2898 AD” సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు అందరి దృష్టి రెండో భాగమైన “కల్కి 2”పై ఉంది.

ఇటీవల ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైందని వార్తలు వచ్చాయి. ప్రభాస్ లేకుండానే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని, అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేశారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి షూటింగ్ జరగలేదని సమాచారం.

తదుపరి షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా పాల్గొంటారని, అప్పుడే ప్రధాన షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. కొత్తగా ఎవరైనా నటులు చేరితే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది. అలాగే దీపికా పదుకొణె స్థానంలో కొత్త హీరోయిన్‌ను తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే, ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె స్వప్నా దత్‌ను యాంకర్లు సరదాగా రిలీజ్ డేట్ గురించి అడిగారు. ఆమె మాత్రం నవ్వుతూ ఆ ప్రశ్నను తప్పించుకున్నారు.

ఈ విషయంపై సుమ కూడా సరదాగా స్పందిస్తూ, నాగ్ అశ్విన్ ఎప్పుడూ గ్రహాలు కలిసి రావాలి అని చెబుతారని జోక్ చేశారు. అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.

మొత్తానికి “కల్కి 2”పై ఇంకా స్పష్టత రాకపోయినా, సినిమా మీద ఆసక్తి మాత్రం రోజు రోజుకి పెరుగుతోంది. అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు