భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అనారోగ్య కారణాలతో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలను అందించిన ఆయన్ని ప్రజలు, రాజకీయ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలో చాణక్యుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ తన జీవితకాలంలో ఎన్నో ఘనతలు సాధించారు. పలు కీలక ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు. పద్మ విభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందిన ఆయన, సమాచార హక్కు చట్టం వంటి కీలక చట్టాలను అమల్లోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. Also Read : న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే! మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా 2019లో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే సినిమాను కూడా తెరకెక్కించారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అనే పుస్తకంలోని విషయాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేసిన 2004-2014 మధ్య జరిగిన సంఘటనలను చూపించారు. విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్రను పోషించారు. రుద్ర ప్రొడక్షన్స్ మరియు పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. విడుదలకు ముందు పలు వివాదాలు ఎదురైనప్పటికీ, ఈ చిత్రం 2019 జనవరి 11న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. Also Read : 'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా! జీ5 లో స్ట్రీమింగ్.. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే తెలుగులో కాకుండా కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆయన జీవితం గురించి అలాగే ప్రధానిగా దేశానికి ఎలాంటి సేవలందించాడో తెలియాలంటే 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' మూవీని కచ్చితంగా చూడాల్సిందే.