Akkada Ammayi Ikkada Abbayi Trailer: '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే రొమాంటిక్ డ్రామాతో హీరోగా తెరంగేట్రం చేసిన యాంకర్ ప్రదీప్.. ఇప్పుడు మరో రామ్ కామ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. నితిన్ భరత్ దర్శకత్వంలో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా చేశాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. అయితే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
ట్రైలర్
కామెడీ, సస్పెన్స్ అంశాలతో ట్రైలర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. కమెడియన్ సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హీరో ఉద్యోగ ఓ ఊరికి వెళ్లగా.. అక్కడ చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు అర్థమైంది. ఇందులో జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తోంది.
Oka ammayi, oka abbayi and lots of fun 💥💥
— T-Series South (@tseriessouth) March 31, 2025
Here's a glimpse into the entertaining world of #AkkadaAmmayiIkkadaAbbayi 🤩 #AAIATrailer out now!
▶️ https://t.co/i7dskvFe1H#AAIA GRAND RELEASE WORLDWIDE ON APRIL 11th ❤️🔥 pic.twitter.com/b8ja1DtZEk
మాంక్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, G M సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ , తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'లే లే.. లేలే' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
cinema-news
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్