/rtv/media/media_files/2026/04/30/prabhas-spirit-2026-04-30-20-35-08.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా Sandeep Reddy Vanga తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ సినిమా స్పిరిట్ Spirit గురించి తాజాగా ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో వచ్చే భారీ ఫైట్ సీన్ కోసం మూవీ టీమ్ ప్రత్యేకంగా సిద్ధమవుతోంది.
మే మధ్య నుంచి ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ ఫైట్ సీన్ కోసం ప్రభాస్ ఇప్పటికే కఠినమైన ట్రైనింగ్ మొదలుపెట్టారు. మే 7 నుంచి రిహార్సల్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు ఈ యాక్షన్ షెడ్యూల్ సాగనుందని సమాచారం. సినిమా మొత్తం లోనే ఇది చాలా కీలకమైన భాగంగా ఉండబోతుందని చెబుతున్నారు.
ఈ ఫైట్ సీన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. రా, పవర్‌ఫుల్ యాక్షన్‌తో ఈ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించబోతుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
సినిమాలో హీరోయిన్‌గా తృప్తి డిమ్రి Triptii Dimri నటిస్తుండగా, విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ Vivek Oberoi కనిపించనున్నారు. అలాగే కొత్త నటి Aishwarya Desai కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
PRABHAS - SANDEEP REDDY VANGA - BHUSHAN KUMAR: 'SPIRIT' NOT POSTPONED... The makers of #Spirit have officially clarified that the film is progressing exactly as planned and will arrive in cinemas worldwide on 5 March 2027.
— taran adarsh (@taran_adarsh) May 6, 2026
There is absolutely NO postponement whatsoever. pic.twitter.com/i0LxI1D6c0
ఇటీవల సోషల్ మీడియాలో ‘స్పిరిట్’ సినిమా వాయిదా పడిందని, మార్చి 2027 బదులుగా డిసెంబర్ 2027లో విడుదల కావచ్చని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై మూవీ టీమ్ అధికారికంగా స్పందించింది.
సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లుగానే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో వాయిదా వార్తలకు పూర్తిగా చెక్ పడింది.
ఈ ఏడాది జనవరి 1న విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. ఆ పోస్టర్‌లో ప్రభాస్ పొడవాటి జుట్టు, గడ్డం, గాయాల గుర్తులతో రఫ్ లుక్‌లో కనిపించారు. చేతిలో గ్లాస్, నోటిలో సిగరెట్‌తో ఆయన స్టైల్ అభిమానులను ఆకట్టుకుంది. పక్కనే త్రిప్తి దిమ్రి చీరలో కనిపించిన స్టిల్ కూడా వైరల్ అయింది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను [T-Series], భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మొత్తం ఎనిమిది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ మొదటిసారి రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us