ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23 న అనౌన్స్‌మెంట్ రానుందట. By Anil Kumar 20 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి హనుమాన్' మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీతో 'PVCU' పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్ నుంచి ప్రతీ ఏడాది ఓ సినిమా వస్తుందని అన్నాడు. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సుమారు 20 కథలు రెడీగా ఉన్నాయని ఆయన ఇప్పటికే చెప్పారు. దీంతో ప్రేక్షకులు ప్రశాంత్‌వర్మ తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు ఇప్పటికే ఈ యూనివర్స్ నుంచి జై హనుమాన్, కాళీమాత, మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌లను ప్రశాంత్ వర్మ చేయబోతున్నాడు. అయితే ఈ మూడు సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. Also Read : 'పుష్ప2' స్పెషల్ సాంగ్.. రంగంలోకి ప్రభాస్ హీరోయిన్ బర్త్ డే రోజు అనౌన్స్ మెంట్.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రానుండగా.. ఈ సినిమాను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా.. అక్టోబర్ 23న అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ సోషియో ఫాంటసీ జోనర్ లోనే ఉంటుందని అంటున్నారు. Also Read : హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్ ప్రభాస్ ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతుల్లో 4 సినిమాలున్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యాకే ప్రశాంత్ వర్మ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'జై హనుమాన్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : లిఫ్ట్ లో నాగచైతన్య, శోభిత ఏం చేశారో చూడండి! వైరలవుతున్న చై ఇన్‌స్టా పోస్ట్ #prabhas #prasanth-varma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి