/rtv/media/media_files/2026/03/24/darling-re-release-2026-03-24-07-44-34.jpg)
Darling Re Release
Darling Re Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas తన పాత హిట్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయనకు “డార్లింగ్” అనే పేరు తెచ్చిన డార్లింగ్ Darling సినిమా మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది.
Some love stories don’t age… they stay with us forever ❤️
— Daya Arjun (@DayaArjun2) March 23, 2026
Prabha & Nandini are coming back to make us fall in love all over again ✨#Darling4K Grand Re-Release on April 23, 2026 🎬
Grand Re-Release by @KedarFilms#RebelStar#Prabhas@MsKajalAggarwal@gvprakash… pic.twitter.com/yV59ie85QS
2010లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో ప్రభాస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఆయన నటన, స్టైల్ ప్రేక్షకులకు చాలా నచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 23న మళ్లీ రిలీజ్ అవుతుందని సమాచారం.
ఈ సినిమా ఒక ప్రేమ కథ. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన హీరో తన చిన్ననాటి స్నేహితురాలు నందినితో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మళ్లీ కలుసుకుంటాడు. వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. అయితే కథలో మరో ట్విస్ట్‌గా గ్యాంగ్‌స్టర్ కుమార్తె నిషా కూడా హీరోను ప్రేమిస్తుంది. ఈ లవ్ స్టోరీలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాను కరుణాకరన్ A. Karunakaran తెరకెక్కించారు. ప్రభాస్, కాజల్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల వచ్చిన ది రాజాసాబ్ తో మరోసారి తన క్రేజ్‌ను చూపించాడు. ఇప్పుడు ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సలార్ పార్ట్ 2 Salaar Part 2: Shouryaanga Parvam, స్పిరిట్ Spirit వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
మొత్తానికి, “డార్లింగ్” రీ-రిలీజ్‌తో ప్రభాస్ అభిమానులు మళ్లీ ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం దొరికింది.
Follow Us