/rtv/media/media_files/2026/02/24/munna-re-release-2026-02-24-17-21-04.jpg)
Munna Re Release
Munna Re Release: రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా తెరకెక్కిన మున్నా Munna సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 6వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Everything you want in a re-release. 🤩
— Sri Venkateswara Creations (@SVC_official) February 23, 2026
Swag. Style. Screen presence. Chartbuster album. 🔥🔥🔥
The Rebel Star ⭐️ in his ultimate stylish form. 🤩🤩🤩💥💥💥#Munna returns March 6. ❤️🔥❤️🔥❤️🔥
𝗚𝗿𝗮𝗻𝗱 𝗥𝗲 𝗥𝗲𝗹𝗲𝗮𝘀𝗲 𝗼𝗻 𝗠𝗮𝗿𝗰𝗵 𝟲𝘁𝗵#MunnaReReleaseOnMarch6th… pic.twitter.com/atPCIdswD2
‘మున్నా’ సినిమా మొదటగా 2007 మే 2న విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆయన స్టైల్, యాక్షన్ సీన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇలియానా Ileana D'Cruz హీరోయిన్‌గా నటించారు. ఆమె అందం, నటన ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు దర్శకత్వం వంశీ పైడిపల్లి Vamshi Paidipally. ఇది ఆయనకు తొలి సినిమా. కమర్షియల్‌గా పెద్ద విజయం కాకపోయినా దర్శకుడిగా మంచి పేరు తీసుకువచ్చింది.
సినిమాలో ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్ కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని హరీష్ జయరాజ్ Harris Jayaraj అందించారు. పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రాన్ని Sri Venkateswara Creations బ్యానర్‌పై దిల్ రాజు Dil Raju నిర్మించారు.
అప్పట్లో అబోవ్ యావరేజ్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు రీ రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో చూడాలి. ప్రస్తుతం పాత హిట్ సినిమాలను మళ్లీ విడుదల చేసే ట్రెండ్ నడుస్తోంది. ఆ జాబితాలో ‘మున్నా’ కూడా చేరింది. అభిమానులు మళ్లీ పెద్ద తెరపై ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us