/rtv/media/media_files/2025/02/28/ZhRjx61F6iMUwtlJnJZ5.jpg)
Kanchana 4- Pooja Hegde
Kanchana 4- Pooja Hegde: తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ పూజాహెగ్డే. ఇటీవలే ‘దేవా’ (Deva) సినిమాతో జర్నలిస్టు దియాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పూజా.. సూర్య తో 'రిట్రో', లారెన్స్ తో 'కాంచనా- 4' లాంటి సినిమాలను చేస్తుంది. అయితే పూజా ఫస్ట్ టైం ఒక సాహసం చేయబోతుందట. వెండి తెర అందాల తారగా వెలిగిన పూజా తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటివరకు పూజా ఒక్కసారి కూడా డీ గ్లామర్ పాత్రల్లో కనిపించలేదు. దాంతో పూజా ఫాన్స్ ఈ వార్త విని షాక్ అవుతున్నారు.
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న "కాంచన 4" చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పూజా హెగ్డే డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతుందన్నది కన్ఫర్మ్ అయింది. ఆమె పాత్ర ఒక వెనుకబడిన పల్లెటూరి అమ్మాయిగా ఉంటుందట. డీ గ్లామర్ రోల్ లో ఫుల్ మాస్ గా కనిపించబోతుంది పూజా. "గంగ" సినిమాలో నిత్యామీనన్ పాత్రకంటే డీ గ్లామర్‌గా పూజా హెగ్డే పాత్ర ఉండబోతోందట.
Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ
బధిర యువతి గా పూజా..!
అయితే, పూజా హెగ్డే ఈ సినిమాలో బధిర యువతి గా కనిపిస్తూ కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది అని సమాచారం. 'కాంచన-4' సినిమా మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా పూజా పాత్ర నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ టైం డీ గ్లామర్ రోల్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది పూజా.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నోరా ఫతేహీ కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది. మొత్తానికి 'కాంచన-4' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా పూజా, నోరా ఫతేహీ పాత్రలు నిలవనున్నాయని సమాచారం.
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్