Pooja Hegde: పూజా హెగ్డే, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అనేక స్టార్ హీరోలతో సినిమాలు చేసింది, మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలతో టాలీవుడ్ లో అమ్మడి రేంజ్ మారిపోయింది.
కానీ, ఈ మధ్యకాలంలో పూజ కొంచెం స్లో అయింది అనే చెప్పాలి. దానికి కారణం రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అదే సమయంలో, శ్రీలీలకు ఎక్కువ డిమాండ్ రావడంతో పూజాను పక్కనపెట్టేశారు అంతా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ గుంటూరు కారం లోను ఛాన్స్ మిస్ చేసుకుంది.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
అయితే, పూజా హెగ్డే ఇప్పుడు మళ్ళీ కెరీర్ లో ఊపు అందుకుంది. విజయ్, సూర్య వంటి ప్రముఖ హీరోల సినిమాల్లో నటించడానికి అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్‌లో కూడా ఆమె ఒక సినిమాకు సైన్ చేసింది.
పూజా హెగ్డే బాలీవుడ్ లో 'దేవా' అనే సినిమాలో నటించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో పూజా హెగ్డే, షాహిద్ కపూర్ మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్‌లు సెన్సార్ బోర్డును సైతం షాక్ అయ్యేలా చేశాయంట. ఈ కారణంగా, ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది.
Also Read: Kannappa: డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. కన్నప్పలో నుంచి ప్రభాస్ పోస్టర్ గ్లిమ్ప్స్ !
6 సెకన్ల లిప్ లాక్ సీన్ కట్..
ఇందులో కొన్ని సీన్స్, అసభ్య పదజాలం ఉన్నాయని సెన్సార్ బోర్డు చెబుతుంది. అలాగే, 6 సెకన్ల లిప్ లాక్ సీన్ ఉన్నట్లు కూడా సెన్సార్ బోర్డు తెలిపింది. అయితే ఆ కిస్ సీన్ ని కట్ చేసేశారని తెలుస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, షాహిద్ కపూర్ మధ్య హాట్ రొమాన్స్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని టాక్. దేవా సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ మూవీతో అయినా బుట్టబొమ్మ కం బ్యాక్ ఇస్తుందో లేదో..
Also Read: వాంతికి రావడంతో బస్సులో నుంచి తల బయటకు.. కట్ చేస్తే రోడ్డుపై తల, చేయి!