Pooja Hegde: దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా?

రాఘవ లారెన్స్ 'కాంచన' సిరీస్ నుంచి త్వరలోనే పార్ట్-4 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైనట్లు సమాచారం. మొదట ఈ పాత్రకు నయనతారను అనుకున్నప్పటికీ, చివరకు పూజా హెగ్డేను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
pooja hegde in kanchana

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇప్పుడు కోలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే దళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్ తో ఛాన్స్ సినిమాలు చేస్తోంద. ఈ రెండు చిత్రాలు 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ కి కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 

రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీలో పూజా హెగ్డే కూడా భాగం అవుతోంది. లారెన్స్ 'కాంచన' సిరీస్ నుంచి త్వరలోనే పార్ట్-4 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానీ 'కాంచన-4' ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. లారెన్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 'కాంచన 4' స్క్రిప్ట్ పూర్తయిందని, ఇది తన గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

కాగా ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైనట్లు సమాచారం. మొదట ఈ పాత్రకు నయనతారను అనుకున్నప్పటికీ, చివరకు పూజా హెగ్డేను సెలెక్ట్ చేశారట. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే  ప్రారంభం కానుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు