Jani Master : కస్టడీలో జానీ మాస్టర్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం

జానీ మాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అత్యాచారం కేసుకు సంబంధించి కీలక విషయాలను బయటకు లాగనున్నారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు జానీ పొంతనలేని సమాదానాలు ఇస్తున్నట్లు సమాచారం. కాగా జానీని 4రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

New Update
jani mast

Jani Master: కస్టడీలో జానీ మాస్టర్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న రాత్రి జానీ మాస్టర్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. యువతికి 16 ఏళ్ల వయసు ఉన్నపుడే అత్యాచారానికి పాల్పడ్డావా?, ముంబైలోని హోటల్‌లో అర్ధరాత్రి యువతి రూమ్‌లోకి వెళ్లి ఏం చేశావ్..?, వీడియోలు చూపించి బెదిరించావా..?, షూటింగ్ సమయంలో కార్‌వ్యాన్‌లో యువతిని వేధించావా..?, మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశావా..?, నాలుగేళ్ల నుంచి యువతిని అత్యాచారం చేశావా..? అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. పోలీసుల ప్రశ్నలకు జానీ మాస్టర్ పొంతనలేని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.  

4రోజులే టైం..

అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో వాస్తవాలు బయటకు తెచ్చేందుకు జానీ మాస్టర్ ను తమ కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిన్న పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం జానీ మాస్టర్ ను విచారించేందుకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కాగా ఇటీవల ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్ కు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న జానీ మాస్టర్ ను తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న కస్టడీ తీసుకున్న పోలీసులు.. మరో మూడు రోజుల పాటు జానీని విచారించనున్నారు.

Also Read :  కంగనాకు భారీ ఊరట.. 'ఎమర్జెన్సీ' విడుదలకు గ్రీన్ సిగ్నల్

Advertisment
Advertisment
తాజా కథనాలు