/rtv/media/media_files/2026/03/02/aipulse-2-price-5-2026-03-02-21-53-22.jpg)
టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెలోడీ సాంగ్ విడుదల
తాజాగా ఈ చిత్రంలోని బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ "ప్రేమ ఓ ప్రేమ" అనే పాటను సీనియర్ జర్నలిస్ట్ ప్రభు చేతుల మీదుగా విడుదల చేశారు. అన్విక ఆడియోస్ ద్వారా విడుదలైన ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతం సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా నచ్చుతుందని, ట్రెండింగ్‌లో నిలిచిపోతుందని దర్శకుడు సంజీవ్ మేగోటి నమ్మకం వ్యక్తం చేశారు. ఇది తప్పకుండా ఈ ఏడాది సూపర్ హిట్ లవ్ సాంగ్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా నేపథ్యం, ప్రత్యేకతలు
ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర మాత్రమే కాకుండా రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ వంటి సుమారు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక విభాగాలు చాలా బలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఆధ్వర్యంలో రూపొందించిన ఫైట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి.
త్వరలో విడుదల
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow Us