Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ఉగాది పోస్టర్ చూసారా..? పవర్‏ఫుల్ లుక్‏లో అదరకొట్టిన DCM

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' నుండి ఉగాది సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ‘హరి హర వీరమల్లు పార్ట్‌1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో వస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.

New Update
Pawan Kalyan Harihara Veeramallu

Pawan Kalyan Harihara Veeramallu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరి హర వీరమల్లు'(Harihara Veeramallu) నుండి ఉగాది సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పవన్ సినిమాలలో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న  'హరి హర వీరమల్లు' పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని మొదట మార్చ్ 28నే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ మే 9కి వాయిదా వేశారు మూవీ టీం.

Also Read: ఈసారైనా హిట్టు కొట్టు గురూ.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త సినిమా!

"ధర్మం కోసం యుద్ధం"

నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా మే 9 రిలీజ్ అని తెలిపారు. పోస్టర్ లో యుద్ధ వీరుడు లాంటి రూపంతో ముఖంపై  చిరునవ్వుతో అందంగా కనిపించరు పవన్ కళ్యాణ్. "ధర్మం కోసం యుద్ధం" అంటూ ట్యాగ్ లైన్ రాస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ చిత్రం రెండు పార్టులు గా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ని ‘హరి హర వీరమల్లు పార్ట్‌1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్ చేయనున్నారు.

Also Read: అవుడేటెడ్, బోరింగ్.. అసలేంటి ఈ సినిమా.. 'సికందర్' డైరెక్టర్ పై ఫ్యాన్స్ ట్రోలింగ్

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్ నటిస్తుండగా , విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం బాధ్యతలు క్రిష్‌ జాగర్లమూడి వహిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read: మోదీ లాగే నేను.. అందుకే పిల్లల్ని వద్దనుకున్నా : హరీష్ శంకర్

ఇప్పటికే రిలీజైనా పాటలకు మంచి స్పందన వస్తోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం  పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. మిగిలిన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసుకొని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మే 9 న వేసవి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. 

Also Read: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lakshmi Rai: బికినీ అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్!

నటి లక్ష్మి రాయ్ బికినీ అందాలతో రెచ్చిపోయింది. తాజాగా బికినీలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు చూశారా?

New Update
Advertisment
Advertisment
Advertisment